15, సెప్టెంబర్ 2012, శనివారం

ALFRED HITCHCOCK --contd.



  1954లో రెయర్విండోrear window సినిమా జేంస్ స్టీవర్ట్,గ్రేస్కెల్లీ తో తీసాడు.హీరో కాలు విరిగి మంచం పాలయి ఊసుపోకకు కిటికీ లోనుంచి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ని గమనిస్తూఉంటాడు.ఎదురుగా ఒక ఫ్లాట్లో భర్త భార్యని హత్యచేసి,శవాన్ని ఎక్కడో దాచినట్లు అనుమానిస్తాడు. మొదట్లో అతని ప్రియురాలు ,డిటెక్టివ్ మిత్రుడు నమ్మరు.చివరికి వాళ్ళ సాయంతో రహస్యాన్ని చేదిస్తాడు.ఇందులో గ్రేస్ కెల్లీ విలన్ ఇంట్లోకి పరిశోధించడానికి వెళ్ళగా అప్పుడే వాడు తిరిగి రావడం ,ఆమె దాక్కొని ఎలాగో తప్పించుకొనడం,  ఇదంతా నిస్సహాయంగా కిటికీ లోంచి చూస్తున్న స్టీవార్ట్  తో బాటు మనమూ చాలా సస్పెన్స్ అనుభవిస్తాము.
 the man who knew too much sinimaaలో హీరోకి ఒక వీ.ఐ.పీ. ని హత్య చెయ్యడానికి జరుగుతున్న ప్రయత్నం తెలుస్తుంది.ఆ ముఠా అతని నోరు మూయించడానికి అతని కొడుకును కిద్నాప్ చేస్తారు.ఇందులో డోరిస్ డే పాడిన కేసెరాసెరా  అనేపాట ప్రసిద్ధమైనది.చివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్లో సంగీత కచేరీ జరుగుతున్నప్పుడు ముఠా జరపబోయిన హత్యాప్రయత్నాన్ని హీరో భగ్నం చేస్తాడు.ఈ సీనులో సంగీతం తారస్థాయికి చేరుతూ దానితో బాటు action,suspense పెరుగుతాయి. గొప్పగా ఉంటుంది.
  55లో to catch a thief సినిమాలో కేరీగ్రాంట్ పూర్వం పెద్ద దొంగగా ఉండినా ప్రస్తుతం మర్యాదగా జీవితం గడుపుతూ ఉంటాడు.సంపన్నుల విడిది ఫ్రెంచ్ రివేరా లో వరసగా ఆభరణాల చోరీ జరుగుతుంటాయి.పోలీసులు గ్రాంట్ని అనుమానించి నిఘా పెడతారు.తన నిర్దోషిత్వాన్నొ నిరూపించుకొనడానికి అతడు ప్రయత్నించి ఎలాగో అసలు దొంగను పట్టుకుంటాడు.ఇంతకీ అసలు దొంగ హీరో స్నేహితురాలయిన ఒక యువతే ! ఈ చిత్రానికి అకాడమీ అవార్డు లభించింది.
  58లో వెర్టిగో vertigo అనే చిత్రం  ఒక నవల ఆధారంగా తీసారు.జేంస్ స్టీవార్ట్ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్.అతనికి ఎత్తయిన స్థలాలంటే భయం.acrophobia అంటారు. అందువలన ఒక హత్యను సరిగా శోధించలేక పోతాడు.చర్చి శిఖరం నుంచి పడిపోయి మరణించింది అనుకొన్న స్త్రీ మరలా కనిపిస్తే ,ఆమె వెంటబడి రహస్యాన్ని కనుగొంటాడు.జరిగిందేమంటే భర్త భార్యను చంపి చర్చి పై నుంచి తోసివేసి ఆమె లాగే ఉన్న మరొక స్త్రీ చంపోయినట్లు డిటెక్టివ్ ని నమ్మిస్తాడు.ఇటీవల అమెరికాలో ప్రేక్షకుల సర్వేలో దీనిని అత్యుత్తమ చిత్రం గా ఎన్నుకున్నారు.
 1959లో  North by North west వచ్చింది.ఇందులో మళ్ళీ కేరీ గ్రాంట్ హీరో.తనను చంపబోయే విలన్ల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నాలతోనే కథ నడుస్తుంది.శత్రువు హెలికాప్టర్ తో దాడి చేసినప్పుడు గోధుమపొలాల్లో  దూరి తప్పించుకొనేసీను,చివర్లో మౌంట్  రష్మోర్ మీద తీసిన దృశ్యాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి.(mount Rushmore మీది giant size నలుగురు అమెరికన్ ప్రెసిడెంట్ల ముఖాల  చెక్కడాలపైన ఈ దృశ్యం చిత్రీకరించారు.
   1960 లో సైకో  (psycho) చిత్రం తీసాడు.ఇది ఒక కల్ట్ సినిమా అని చెప్పవచ్చును.ఒక నవల ఆధారంగా తీసింది.మోటల్ షవర్లో జరిగిన హత్య ,తల్లి శవం (mummy) తో సైకో సంభాషణ ,చివరి సీను అన్నీ అప్పట్లో కొత్త.జలదరింపు కలిగిస్తాయి.తర్వాత సైకో ని అనుకరిస్తూ చిత్రాలు ఎన్ని వచ్చినా ఇదే అన్నిట్లోకి ఉత్తమమైనదిగా పేరు పొందింది.(psychic killers are common in America.Now they are increasing in India also )ఈ చిత్రాన్ని నేను రెండు సార్లు చూసాను.
   తర్వాత బిర్డ్స్ (BIRDS ) అని ఒకనవల ఆధారంగా తీసాడు.ఇందులో వేలకొద్దీ పక్షులు మనుషుల మీద దాడి చేస్తుంటాయి.నాకు అంతగా నచ్చలేదు.
  (మిగతా మరొక సారి.)
 

కామెంట్‌లు లేవు: