5, జూన్ 2012, మంగళవారం

visvsnatha novels -contd.




  నాకు విశ్వనాథవారి  'దిండు కింద పోకచెక్క 'నవల జ్ఞాపకం లేదు.అది నేపాళ రాజ వంశచరిత్రలలో ఒకటి అనుకొంటాను.'బాణామతి 'అంటే చేతబడి.అది మూఢ విశ్వాసం ఆధారంగా రాసిన నవల కాబట్టి మనకు నచ్చదు.
  'ఏకవీర 'చాలా కాలం కింద చదివిన నవల.దాని ఆధారంగా తీసిన సినిమా కూడా దాదాపు 40 ఏళ్ళు కావచ్చింది.గుర్తు తెచ్చుకొని రాస్తున్నాను.ఈ సినిమాలో N.T.రామారావు, కాంతారావు ,K.R.విజయ ,జమున ప్రధాన పాత్రధారులు.నటన,సంగీతం బాగుంటాయి కాని high brow అవడంవలన విజయం సాధించలేదు.
 ఏకవీర కథ 18 వ శతాబ్దం ,చారిత్రక నేపథ్యం గలది.అప్పటికే ఇంగ్లిష్ వారు ,ఫ్రెంచ్ వారు మన దేశంలో రాజ్యస్థాపన కోసం ,ఆధిపత్యం కోసం పెనగులాడుతున్నారు. మధుర,తంజావూరు రాజ్యాలను ,దక్షిణాంధ్ర నాయక రాజులు పరిపాలిస్తున్నారు.
  రాజకుమారుడు ,అతని మిత్రుడు ఇద్దరు చెరొక యువతిని ప్రెమిస్తారు.కాని విధివశాత్తు, ఒకరు ప్రేమించిన యువతిని మరొకరు వివాహం చేసుకో వలసి వస్తుంది.అందువలన వాళ్ళ జీవితాల్లో కలిగిన సంక్షోభం ,ఆవేదన చక్కగా చిత్రింపబడినవి.విశ్వనాథ వారి శైలి ,వర్ణనలు బాగుంటాయి.అవి వారి ప్రత్యేకత.చివరకు కథ విషాదాంతం అవుతుంది.
  ఈ నవల మళ్ళీ చదువుదామని ప్రయత్నించాను.కాని ఎక్కడా దొరకలేదు.(to be contd.)
  

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Please read banavathi . Yandamuri told so high about it one of his interview that it was the inspiration for the famous thulasidalam etc.
What is important is how the story was told but not the subject.

రవి చెప్పారు...

విశ్వనాథ అంటే ఇష్టం లేని వాడుగా ఇక్కడ వ్యాఖ్యానించడం నాకు సబబు కాదు. అయినా అతని విమర్శకుడు గా నాదొక్క చిన్న మనవి.

దయచేసి ’దిండు కింద పోకచెక్క’ నవల చదివి, అందులో ’నేపాళదేశ రాజచరిత్ర’ ఎంత ఉందో, ఆ నవల (వెనుక ఆయన) ఉద్దేశ్యమేమిటో స్పష్టంగా తెలుసుకోగలరు.