3, జూన్ 2012, ఆదివారం

novels of ViSwanatha Satyanarayana

విశ్వనాథ వారి బహుముఖ ప్రజ్ఞా విశేషాల గురించి తెలిసిందే.ఆయన రామాయణ కల్ప వృక్షం ,ఆంధ్రప్రశస్తి, వంటి గొప్ప కావ్యాలే గాక కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి వంటి సరళ గేయాలు కూడ రచించారు. నవలలు,నాటకాలు రాసారు.ఆయన చేపట్టని ప్ర క్రియ లేదు.వేయి పడగలు  అనే బృహత్ నవల గు రించి ఈ మధ్య చర్చించు కున్నాము.దాని  తర్వాత చెలియలి కట్ట ,ఏకవీర నవలలు  ప్రసిద్ధి పొందాయి .
  చెలియలి కట్ట అంటే సముద్రపు గట్టు. సాధారణంగా ఆ హద్దుని దాటి సముద్రం రాదు.వచ్చింది అంటే ఏ సునామీ లాగానో నాశనం చేస్తుంది .అలాగే కొన్ని సాంఘిక కట్టుబాట్లు దాటితే సమాజానికి చేటు కలుగుతుంది .ఈ  నవల లో ,వదిన ,మరది  మధ్య అక్రమ సంబంధం కథావస్తువు .దాని వలన

 కలిగిన దుష్ ఫలితాలు  చిత్రించ బడినవి .చివర
 ముగింపు విషా దంతం.  (మిగతా మరొక సారి .)

1 కామెంట్‌:

www.apuroopam.blogspot.com చెప్పారు...

శ్రీ విశ్వనాథ వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో ఎటువంటి ఆక్షేపణా లేదు.కాని ఎందుకనో ఆయన నవలలు ఏవీ నా చేత చదివించలేక పోయాయి.అది నా లోని లోపమే కావచ్చు.కాని " విశ్వనాథ వారు నాకు గురుతుల్యులు, వారి చెలియలి కట్ట చదివి నవలలు ఎలా రాయకూడదో నేర్చుకున్నా"నంటాడు ఆరుద్ర1960 లలో భారతి లో ప్రచురింపబడ్డ ఒక వ్యాసంలో. అదీ ఆయన అబిప్రాయమే అని సరి పెట్టుకుందాము.కవిగా ఆయనను పాషాణపాక ప్రభూ అని శ్రీశ్రీ గారు సంబోధించినా కవిసమ్రాట్టుకు వచ్చిన లోపమేమీ లేదు.వ్యక్తిగా ఆయనను చాలా గర్విష్టిగా అందరూ చెప్పుకున్నా ఆయన గురించి చదివిన కొన్ని ఉదంతాలు అయన ఎంతటి నవనీత మనస్కుడో తెలియజేస్తాయి.ఇక మంచి కవిత్వం ఎక్కడున్నా దాన్ని ఆస్వాదించడంలోనూ, మెచ్చుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి అనిపింటే ఉదంతాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి " నవనీత మనస్కుడు కవితాంతరంగుడు శ్రీ విశ్వనాథ" అనే పోస్టులో మధ్యనే నే నా బ్లాగు " అపురూపం " లోవివరించాను. త్వరలోనే మరో రెండు ముచ్చట్లు చెప్పబోతున్నాను. అవి ఆయన వ్యక్తిత్వాన్ని సరిగా అర్థం చేసుకునేందుకు ఉపయోగ పడతాయని నా భావన.