1, జూన్ 2012, శుక్రవారం

BLOGS



 మా తరంవారికి కప్యూటర్లు ,ఇంటర్నెట్,తెలియదు.అప్పుడివి ఇండియాలో ప్రచారంలోకి రాలేదు.ఇటీవల కాలక్షేపం కోసం కొంచెం నేర్చుకొని బ్లాగులు చదవడం,వ్రాయడం చేస్తున్నాను.కాని ఫొటోలు,ఆడియోలు  ఉటంకించడం రాదు.ఆ మాయా మర్మాలు తెలిసిన నిపుణులు పెట్టుతున్న మంచి ఫొటోలు ,విడియోలు, ఆడియోలు చూసి ,విని ,ఆనందిస్తున్నాను.ఎన్నో sources నుంచి సేకరించిన దృశ్యాలు,సమాచారము,విజ్ఞానము కొద్దిగానైనా ఒకే చోట లభ్యం అవుతున్నది.
  ఈ బ్లాగులు వ్రాసేవారిలో 20నుంచి 80 వరకు వయస్సు వున్నవాళ్ళు,మహిళలు,కవులు,పండితులు,డాక్టర్లు,ఇంజనీర్లు,సైంటిస్టులు,ఉద్యోగులు,విద్యార్థులు  ఇంకా ఎన్నో వర్గాల వాళ్ళు ఉన్నారు.వివిధ అంశాల మీద సాధికారంగా వ్రాయగలిగిన వాళ్ళు ఉన్నారు.తీవ్రవాదులూ,మితవాదులూ ,సనాతనధర్మ వాదులూ ,నాస్తికులూ అందరూ ఉన్నారు.మంచిదే.ఎవరి అభిప్రాయాల్ని వారు గట్టిగా,తీవ్రంగా ప్రతిపాదించవచ్చును.వాదించవచ్చును.
  కాని కొందరు హద్దుమీరి పరుషవాక్యాలు రాయడం, తిట్టడం,indecent and unparliamentary language  తో అసభ్యంగా ఒకరినొకరు దూషించుకొంటున్నారు.ఇది మంచిదికాదు.ఎందుకంటే వారు మాత్రమే కాక ఎవరైనా చదువుతారు కదా!పెద్దవాళ్ళు,స్త్రీలు కూడా.అందువలన కాస్త సం యమనం పాటించమని విజ్ఞప్తి చేస్తున్నాను.బ్లాగు మిత్రులందరికీ అభినందనలు.

1 కామెంట్‌:

పల్లా కొండల రావు చెప్పారు...

మంచి సూచన. అందరూ పాటించాల్సిన అంశం.