28, మే 2015, గురువారం

prasannabhaaskaram
 ప్రసిద్ధ కవీ,అధ్యాపకుడు,పండితుడూ ఐన శ్రీ మానాప్రగడ శేషశాయిగారి 'ప్రసన్నభాస్కరం 'ఈ మధ్యనే నాకు లభించింది.ఆయనకు చూపు మందగించినప్పుడు రచించినట్లు తెలుస్తోంది.మొత్తం 223 పద్యాలున్నవి.అందులో రెండు మాత్రం ఉదహరిస్తాను.    
    చం'; హరితమణి చ్చటా చకిత హారి తురంగమ సప్తకాప్రభా
           పరిణతమద్భుత ప్రణమితామరమౌళి గుళుచ్చ కాంతిభా
           సురము,జగత్త్రయీ సదనసుందర కాంచన తోరణమ్ము, భా
           స్కర నవరత్న  మండలము,చయ్యన మాకు బ్రసన్నమయ్యెడున్

   మత్తే';  నిను సేవింప రవీ !మయూరుడనుగానే,లేక శ్రీనాథుడై
             నను గానే ,దరినుండు చాయనైనన్ గానే,ఉషహ్కాంతినై
             నను గానే,ప్రియపద్మినీరమణి నైనంగానె త్రైలోక్యపా
             వనముల్ నీఅరుణారుణ ప్రభలెటుల్ వర్ణింపగా జాలుదున్?
   అన్ని పద్యాలూ అద్భుతంగా ఉన్నాయి.సంస్కృతంలోని మయూరశతకంకి సాటి వస్తుందని ధీమాగా  చెప్పగలను.