17, ఫిబ్రవరి 2015, మంగళవారం

mahabharatam
 ఇదండీ భారతం 'గురించి రంగనాయకమ్మగారి ఇంటర్వ్యూ టీ.వీ. 9 లో చదివాను.ఆవిడ ,ఆమె మిత్రులు ఈ మధ్యనే భారతాన్ని చదివినట్లుంది.ఆవిడ చెప్పిందానిలో  నాకు కొత్త ఏమీ కనిపించలేదు.ఇప్పటికే ఎందరో పరిశోధకులు ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి  రాసారు.ప్రపంచ  క్లాసిక్స్ లో ఒక ముఖ్యమైన  గ్రంథంగా పండితులు పరిగణించేదానిలో ఆవిడకు మెరిటేమీ కనిపించకపోవడం విచిత్రమే. మనం గుర్తించవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి.1.దాదాపు 4000 సం; క్రితం రాజ్యం  కోసం  జరిగిన పెద్ద యుద్ధం  ఇందులో మూలకథ.వ్యాసుడి interpretation లో పక్షపాతం ఉండవచ్చును కాని కథాంశాలు,పాత్రల చిత్రీకరణలో ఏదీ దాచలేదు.2.అప్పటి వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ.రాజులు,రాజ్యాల కోసం యుద్ధాలు మామూలే.వర్ణ వ్యవస్థ కూడవాస్తవమే.మనం ఆపరిధిలోనే ఆలోచించాలి.3.రంగనాయకమ్మగారు బోధించే  మార్క్సిజం ఏమైంది?అన్నిచోట్లా విఫలమైంది కదా?4.నాకు మహాభారతంలోనచ్చిన విషయాలు;ధర్మాధర్మాల గురించి,యుద్ధము,శాంతి గురించి వాదోపవాదాలు,చర్చలు.అవి ఈ రోజుల్లో కూడా అన్వయిస్తాయి కదా.అలాగే ఆసక్తి కరమైన  పెద్ద కథ,వివిధ మనస్తత్వాల చిత్రణ కూడా ఆకర్షిస్తుంది.

3 వ్యాఖ్యలు:

sarma చెప్పారు...

నా మాట బలపరిచినవారు ఇన్నాళ్ళకు మీరు కనపడ్డారు, సంతసం. వీరు కొత్తగా చెప్పేదేం లేదు భారతం లో ఇప్పటికే చాలా మంది దీని మీద తర్జన భర్జనలు చేసేసేరు. ఆ కాలంలో జరిగినది, ఇతిహాసం అన్నారు, ఏదీ దాచాలేదు, అప్పటి ధర్మాన్ని బట్టి చూడాలి గాని ఇప్పుడు ధర్మాన్ని బట్టి వ్యాఖ్యానిస్తే ఎలా?

Sasidhar Pingali చెప్పారు...

దీన్ని బట్టి చూస్తే రంగనాయకమ్మగారు చాలావరకూ విజయవంతమైనట్లే కనిపిస్తుంది. మీలాంటి పెద్దల్నికూడా పోనీలే, పరవాలేదనే ధోరణిలో ఆలోచింపచేసింది. ఇంతవయసు వచ్చేవరకూ భారతం తెలీదనటమే ఓ విచిత్రం. (చదవటం వేరు తెలీటం వేరు). భారత రామాయణాలనేవి నిన్నటి జనరేషన్ వరకూ జీవితాలలో భాగమై అయాచితంగా లభించిన జ్ఞానం. కనీసం కొద్దోగొప్పో తెలీని వారుందరు. యే విషయన్నైనా విమర్శించవచ్చు, కాకపోతే చెప్పేధోరణి సహేతుకంగావుండాలి ధర్మరాజు చదువురానివాడు, వాడికి జూదమాడటంతప్ప రెండో పని తెలీదు. బ్రాహ్మలు సోమరిపోతులు, దానాలు పుచ్చుకోవడమే వారివృత్తి, గీతలోకూడా ఇదే చెప్పాడు... ఇలాంటి పదజాలం సమర్థనీయంకాదు. ఆవిడనమ్మిన కమ్యూనిజం కూడా
100 యేళ్ళనాటి పరిస్తితులు ఇప్పుడులేవు. కథానుగమనాన్ని కాలాన్ని బట్టి అర్థంజేసుకోవాలి. మేరే అన్నట్లు అందులోని మనస్తత్వచిత్రీకరణ ఎప్పుడూ నిత్యనూతనమే. మనంచూస్తూనే వున్నాం.
మొత్తంమీద ఆవిడ టార్గెట్ యువతరమేనని అనిపిస్తోంది. పాతతరాలవాళ్ళు, నమ్మినవాళ్ళు ఓ పట్టాన బయటకురారు, రాలేరు. ఇకపోతే విషయం మీద అంతగా అవగాహనలేని యువతను
సునాయాసంగా దారిమళ్ళించవచ్చు. అందుకు దిగ్విజయంగా ఒక విషబీజాన్ని నాటగలిగారు. ఇక అది మొలకెత్తి మారాకువేయడమే తరువాయి

Pantula Jogarao చెప్పారు...

నేనూ చూసాను ఆ వీడియో ఇంటర్వయూ. పేలవంగా ఉంది.పురిపండా వారి వచన భారతాన్ని, అదీ, ఇటీవలే చదివి, ఇదండీ మమా భారతం అంటూ గొంతు చించుకుని, పుస్తకాలు అమ్ము కోవడం ఆవిడకే చెల్లింది. వందల ఏళ్ళ క్రిందటి సమాజాన్ని, వ్యక్తులనూ, వారి వారి జహజ ప్రవృత్తులతో, బలాలలతో, బలహీనతలతో, ఉదాత్త గుణాలతో, అదే సమయంలో వైరుధ్యాలతో సజీవంగా తొణికిసలాడే పాత్రలతో, కథనంతో ఉండే గొప్ప రచన భారతం.భారతంలో చెప్పిన అసంఖ్యాక మయిన నీతులూ, ధర్మాలూ, ధర్మ పూక్ష్మాలూ,రాజనీతి విషయాలూ,మానవ మనస్తవ్ాలలోని చీకటి వెలుగుల అన్ని పార్శ్వాలూ కూడా ధర్మ రాజు వంటి ప్రథాన పాత్రకు కూడా మినహాయింపు ఇవ్వకుండాదాదాపు సర్వ సమగ్రంగా చర్చించిన గ్రంథం భారతం. ప్రపంచ వ్యాప్తంగా మసకబారినట్టుగా నిరూపిత మయిన కళ్ళద్దాలతో భారతాన్ని చూస్తూ విమర్శింప బూనటం అసమంజసం.