13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

Dr.Kesavareddi.
 డాక్టర్ కేశవరెడ్డి గారి మరణ వార్త చదివి బాధపడ్డాను.ఆయనతో నాకు  పరిచయం లేకపోయినా, ఆయన నవలలు కొన్ని చదివాను.ప్రసిద్ధ రచయిత.''ఇంక్రెడిబుల్ గాడెస్  ',రాముడున్నాడు రాజ్యమున్నాది ' వంటి నవలలు రచించారు.ఆయన నవల 'అతడు అడవిని జయించాడు '  హెమింగ్వే నవల ' oldman and sea  'కి అనుకరణ.'మునెమ్మ ' నవల కూడా కొన్ని విమర్శలకు గురయింది.ఆయన నవలలన్నీ   పల్లెటూళ్ళ వాతావరణం  తో అతి సామాన్యుల జీవితాలకి అద్దం పడతాయి.
    వైద్యునిగా కూడా కుష్టు  రోగులకు ఆయన చేసిన సేవలు స్మరణీయమైనవి .నా సంతాపాన్ని ఈ విధంగా తెలియ జేసుకొంటున్నాను. 

3 వ్యాఖ్యలు:

chavera చెప్పారు...

Oldman and the sea ,కి "అతను అడవిని జయించాడు' అనుకరణ అని వ్రాసారు, నేను మీతో ఏకీభవించలేను. డాక్టర్ కేశవ రెడ్డి గారి రచన తెలుగు సాహిత్యం లోనే ఒక మాస్టర్ పీస్.నాకు హెమింగ్వే రచన కంటే ఎంతో బాగుంది.

కమనీయం చెప్పారు...మీ అభిప్రాయాన్ని మీరు వెలిబుచ్చారు,మంచిదే.కేశవరెడ్డిగారి నవలచాలా బాగుందనే నా అభిప్రాయం కూడా.కాని అది హెమింగ్వే రచనకి అనుసరణ అన్నదీ నిజమే కదా.