19, ఫిబ్రవరి 2014, బుధవారం

payanam (Journey
 ఎచటికి నీ ప్రయాణం-ఏల యీ ప్రయాస?
 ఏది నీ గమ్యం-ఏమిటి నీ లక్ష్యం ?
 చెట్లు పుట్టలు దాటి-చిట్టడవులు దాటి
 కొండల్లో కోనల్లో -ఎండలలో వానలలో
 రాజమార్గంలో కొంత -రమ్యహర్మ్యాలలో కొన్నాళ్ళు
 ఆగుచూ,వెదకుచూ- అగమ్యమైన చోటికి
 ఎచటికి నీ ప్రయాణం-ఏల యీ ప్రయాస ?
 గమ్యంలేదు నా ప్రయాణానికి -కారణమేమో తెలియదు.
 పయనమే నా లక్ష్యం -ప్రయాసయే నా విధి.
 చీకటిలో ,చెలగే-  జిలుగు వెలుగులలో
              కష్టంలోను,సౌఖ్యం లోను,
 చివరి మజిలీ దాకా - చెప్పనలవికాని  నడకే
 జీవిత పరమార్థం ,వేరే లక్ష్యం -చివరి గమ్యం లేని ప్రయాణం
  మనకే తెలియదు మనమెందుకు పయనిస్తున్నామో
  మానవచరిత్ర  సమస్తం -మంచో చెడో పయనించడమే !    
                 -------------

5 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

గమ్యమూ పరమార్ధమూ ఉన్నయి, కానలేకపోతున్నాం.

Padmarpita చెప్పారు...

మంచో చెడో పయనించక తప్పని ప్రయాణం

Padmarpita చెప్పారు...

మంచో చెడో పయనించక తప్పని ప్రయాణం

natana jeevitam చెప్పారు...

గమ్యం ఎటువైపైనా తప్పదు

Chandra Vemula చెప్పారు...

చెట్లు పుట్టలు-చిట్టడవులు దాటి, కొండల్లో, కోనల్లో-ఎండలలో వానలలో .... రాజమార్గాల్లో-రమ్యహర్మ్యాలలో, ఆగుచూ, వెదకుచూ-జీవనం .... తెలియని ఏ గమ్యం వైపో పయనం? .... ఓ నేస్తమా?