8, ఫిబ్రవరి 2012, బుధవారం

known already


  1.
 మా అబ్బాయి అప్పుడప్పుడూ ఫోన్ చేసి కొత్త విషయాలని చెప్పుతూ ఉంటాడు.సైన్సు సంగతులు వదిలేస్తే ,మేనేజ్మెంట్,పరిపాలన,మానవసంబంధాలు, నీతిసూక్తులు,వ్యాపార సూత్రాలు మొ;వాటి గురించి చెప్పినప్పుడు ,నేను ఇవన్నీ వేమన పద్యాల్లో ,సుమతీ శతకంలో ,భర్తృహరి సుభాషితాల్లో,మహాభారతంలో,భగవద్గీతలో,లేక కంఫూషస్ సూత్రాల్లోనో ఉన్నాయని చెప్పేసరికి ,మీరు అగ్నిహొత్రావధానులు లాగ 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయష 'అన్నట్టు మాట్లాడతారని విసుక్కొంటాడు.అవును,మరి ఇవన్నీ పూర్వులు ఎవరో, ఎప్పుడో చెప్పినవే అంటాను.
 2.ఈ మధ్య హొయసాల శిల్పాల ఫొటోలతో ఒకరు బ్లాగు రాశారు .అందులో వరాహావతారంలో విష్ణుమూర్తి భూమిని పైకెత్తినట్లు చూపిస్తూ మామూలుగా చెక్కే స్త్రీమూర్తిగా కాకుండా గోళంలాగ ( globe ) చెక్కేరు.ఆశిల్పాలు 13వ శతాబ్దమ్నాటివి.  యూరప్లో భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దందాకా తెలియదు.బల్లపరుపుగా ఉందని అనుకొనే వాళ్ళు.కపిత్థాకారం భూగోళం అని మనవాళ్ళు   ఎప్పుడో చెప్పారు.( కపిత్థం అంటే వెలగపండు అని అర్థం ) .
 రచన పత్రికలో  చిట్టెన్రాజుగారి  జోకులతో ముగిస్తాను.ఆయనే చెప్పినట్లు జోకులమీద అందరికీ 'కాపీ రైటు ' ఉందికదా.
  1.మొగుడూ, పెళ్ళం, ఒకే నాణేనికి రెండు పక్కలే,ఎందుకంటే  పెళ్ళయ్యాక కొన్నాళ్ళకి ఒకరిమొహం మరొహరు చూసుకోలేరు కాబట్టి!
  2.ఒక ఫిలాసఫర్ యువకుడికి ఇచ్చిన సలహా ' తప్పకుండా  పెళ్ళి చేసుకో .మంచి పెళ్ళాం వస్తే జీవితాంతం ఆనందిస్తావు. లేకపోతే నాలాగ ఫిలాసఫర్వి అవుతావు.
  3.డాక్టర్ పేషెంటుతో 'ఈ రెండు మాత్రలు తీసుకొని రాత్రి ఒకటి వేసుకొండి .పొద్దున్న లేస్తే రెండో మాత్ర వేసుకొండి!

      -------------------------------     

2 వ్యాఖ్యలు:

Sanghamithra చెప్పారు...

బాగుంది. ఇవన్నీ మన వేదాలలో ఉన్నాయష! అలాగే మచ్చుకి మన పూర్వికులు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పుడెలా ఇతరులు కొత్తగా కనిపెట్టి తిరిగి చెబుతున్నారో పొందు పరిస్తే ఇంకా బాగుంటుంది. ఇటీవల కొంత మంది రచనలు కూడా చేస్తున్నారు 'చాణక్య' భగవద్ గీత లను modern management కి ఎలా అన్వయిన్చుకోవచో . 'Machiavelli ', Confucius , SunTzu వంటి వారి రచనలను కూడా ఇప్పుడు management సూక్తులుగా బోధిస్తున్నారు. 'Indian body of knowledge ' మీద ఈ తరానికి కొంత గురి కుదురుతుంది.

అజ్ఞాత చెప్పారు...

Great post..short and sweet words.
Ma avida ku eppudu chebuthanu mana poorvikulu cheppina vatilo chala vignanam vundani...maa mata chivina pettadu..