1-1-2012 ఆంధ్రజ్యోతి హాస్యసంచికలో Y.A.రమణగారి అసూబా అనే బ్లాగు చదివి దానికి కొనసాగింపుగా ఆయనకు కృతజ్ఞతలతో ఇది రాస్తున్నాను.దీనికి ముందటి నా బ్లాగు కూడా చూడండి.దానికిది కొనసాగింపు.
విష్ణుమూర్తీ,పరమశివుడే కాదు,లక్ష్మీ దేవి,సరస్వతీ కూడా కిరీటాలు,పద్మం ,వీణ ఇత్యాది హంగులు లేకుండా కనిపిస్తే పోల్చుకో లేము.
మాటవరసకి, కృష్ణ దేవరాయలు మనమధ్యకి వచ్చాడనుకోండి.ముత్యాలు,తురాయి పొదిగిన తలపాగా,కోరమీసాలు,కత్తీ అవీ లేకుండా వస్తే ఖాతరు చెయ్యం. షాజహాన్ చక్రవర్తి, సిల్కు తలపాగా ,మొఘల్ దుస్తులూ ,ముత్యాలహారాలూ,గడ్డం లెకుండా,వస్తే ఎవరు నువ్వు అంటాము.పురాణాలు,చరిత్ర,వదిలేసి 20,21,శతాబ్దాలకి వస్తే 50,60,ఏళ్ళకిందట వేషాన్ని బట్టి కులాన్ని,మతాన్ని పోల్చుకొనేవీలు ఉండేది.అలాగే తమిళ్,బెంగాలీ ,గుజరాతీ ,పంజాబీ ప్రాంతాలవాళ్ళని నోరు విప్పకపోయినా తెలిసిపోయేది.ఇప్పుడలా కాదుకదా!
మా చిన్నప్పుడు,పోలీసులకి ఎర్రటోపీలు ఉండేవి.ఇన్స్పెక్టర్లకు ఎర్రతలపాగాలు (బంగారు అంచుతో) ఉండేవి.అసలు ఎర్రటోపీ అంటేనే పోలీసు అని అర్థం.దానికి తోడు ఖాకీ డ్రెస్సు. ఇవేమీ లేకుండా వెళితే ఎవరు పట్టించుకొంటారు ?
ఒక్క అసూబాలే కాదు(అమెరికా సూటు బాబులు ) మన దేశంలో కూడా ప్రైవేటు బేంకు ఆఫీసర్లు,కంపెనీ ఎగ్జెక్యూటివ్లూ,మెడికల్ రెప్రజెంటేటివ్లు, కూడా సూటుబాబులే.వా ళ్ళకది తప్పనిసరి,ఉక్కపోత,చెమట్లు తో ఉడికి పోతున్నా.ఎక్కడికైనా సూటు తో కారులో వెళ్ళారనుకోండి.ఆ మర్యాదలే వేరు.(చార్జీలు,ధరలూ ఎక్కువ వాయించేస్తారనుకోండి.)
ఒకప్పుడు,రాజకీయనాయకులకు ,దేశభక్తులకు చిహ్నం ;ఖద్దరు పంచె ,నెహ్రూ కోటు,గాంధీ టోపీ .ఇప్పుడు వాటిని అవినీతికి,మోసానికి చిహ్నాలుగ కార్టూన్లలో చూపిస్తున్నారు.హతవిధీ!అలాగే ఒకప్పుడు షరాయి ,పొడుగు లాల్చీ ,గడ్డం ,పక్కసంచీ ఉంటే కమ్యూనిస్టు,లేక కనీసం లెఫ్టిస్టు రాడికల్ అన్న మాట.అందువల్ల ఆహార్యం లో ఏముంది అని కొట్టివేయకండి.అందులో చాలా ఉంది.
ఇందులో ఆడవాళ్ళ ఆహార్యం గురించి రాయలేదు.మీరెవరు ,మా యిష్టం అనవచ్చును.వాళ్ళ లోనే ఎవరైనా రాస్తే బాగుంటుంది.
'వైద్య వర్యులకు ధవళ వర్ణ కోటు ,
న్యాయమూర్తులకెల్లను నల్ల కోటు,
ఘనులు పోలీసు వారికి ఖాకి తగును
చిత్రమగు వేష మొప్పును చిత్రసీమ.
అసూబాలో రమణ గారు చెప్పినట్లు ,మన వేడి దేశంలో యోగి వేమన ఆహార్యమే ఉత్తమం కాని ,అది మరీ ఘోరం గా ఉంటుంది కాబట్టి ,మగవాళ్ళకి లుంగీ,పైన తుండు గుడ్డ బెస్టు.