చైనా చరిత్రలో మొదటి సామ్రాజ్యం క్విన్ లేక చిన్ వంశంలో 5వ తరం వాడైన ఝెంగ్ అనే రాజు స్థాపించాడు.ఇతని కాలం క్రీ.పూ.246 నుంచి 210 వరకు.దాదాపు చైనా అంతటినీ జయించి చక్రవర్తిగా (షి హువాంగ్డి ) గా పాలించాడు.ఇతడు సమర్థుడు, క్రూరుడు.చైనా వాళ్ళ పేర్లు మనకు చిత్రంగా ఉంటాయి.ఇంగ్లిష్ లోకి వచ్చేసరికి ఉచ్చారణ మారిపోతుంది.అందువలన క్లుప్తంగానే రాస్తాను.క్విన్ చక్రవర్తి పాలన వలన చైనా చరిత్రలో కలిగిన ఫలితాలు,మార్పులు మనకు ముఖ్యం. ఇతని పాలనలో చేసిన పనులు ,జరిగిన సంఘటనలు ముఖ్యం.
1.రాజులు,రాజవంశాలు ఎన్ని మారినా చైనాకు అంతటికి ఒక సామ్రాజ్యం, సామ్రాట్టు ఉండాలనే భావం బలంగా నాటుకొనడం .
2.చైనా జాతి ,దేశం ఇతరుల కన్నా గొప్పదని భావం కలగడం.
3.సరిహద్దుల్లో నుంచి అనాగరక ,సంచారక జాతుల దాడుల నుంచి రక్షించు కొనుటకు ఉత్తర సరిహద్దులో పెద్ద గోడను నిర్మించడం .కాని మనం అనుకొన్నట్లు 3000 మైళ్ళ దూరం ఒకే గొప్ప గోడ కాదట.సందర్శకులు రాజధాని బీజింగ్ దగ్గర ఉన్నట్లు మహాకుడ్యం కాదు.అక్కడక్కడ కోటలు ,బురుజులు ,కొన్ని చోట్ల కట్టెలు ,మట్టి తో కట్టినవి కూడా ఉన్నవి.
4.రాళ్ళతోను,మట్టితోను వందల మైళ్ళ దూరం రహదార్లు నిర్మించడం.
5.(అప్పటికే ఉన్న) హొయాంఘో,యాంగ్ సీ ,నదుల మధ్య కాలువల సిస్టమ్ని అభివృద్ధి చేయడం.
6.శాసనాలద్వారా పరిపాలనా నియమాలని అమలు చేయడం.ఒకే పాలనాపద్ధతులను చైనా అంతటా ప్రవేశపెట్టుట.
7.అప్పటికి ఉన్న గ్రంథాలన్నిటినీ పనికిరావని తగలబెట్టించాడు.కాని కొన్ని కాపాడ బడ్డాయి.
8.తన రాజ్యానికి చిన్న నకలుగా (miniatureempire) గా పెద్ద సమాధిని తన జీవితకాలంలోనే నిర్మింప జేసాడు.కాని దీనిని తర్వాత కాలంలో కొల్లగొట్టారు. A.D.1974లో ఈ సమాధి బయట పడింది.అందులో వందలకొద్ది మట్టితో చెసిననిలువెత్తు సైనికులు,రథాలు కనుగొన్నారు.(Toy army) చైనా పర్యాటకులు విధిగా దర్శించేవి చైనా గోడ,బొమ్మల సైన్యం.
తన తర్వాత శాశ్వతంగా తన వంశం,సామ్రాజ్యం నిలిచి ఉంటాయనుకున్నాడు ,ఈ క్విన్ చక్రవర్తి.కాని త్వరగానే అతని మనమడి కాలంలోనే ఈ సామ్రాజ్యం అంతరించింది.కాని దాని ముద్ర మాత్రం చైనా పైన శాశ్వతంగా పడినది.అది ఎలా జరిగిందో,తర్వాతి పరిణామాలేమిటో మరోసారి రాస్తాను.
1 కామెంట్:
మీ బ్లాగు వల్ల చైన కోసం కొద్దిగ తేలుస్కొగలిగాను.TQ అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి