జాన్ కే అనే రచయిత చాలా పరిశోధించి రాసిన 'china-a history అనే గ్రంథాన్ని చదువుతున్నాను.అగ్రరాజ్యంగా వేగంగా ఎదుగుతున్న చైనా గురించి తెలుసుకోవాలంటే దాని ప్రాచీన చరిత్ర కూడా తెలుసుకోవాలని రచయిత అంటాడు .చాలా క్లుప్తంగా వివరిస్తాను.
1.బి.సి.2000సం. పూర్వం మన షట్ చక్రవర్తులలాగే వాళ్ళు 5 గురు చక్రవర్తులు పాలించారని నమ్ముతారు.
2.చారిత్రక కాలానికి వస్తే దాదాపు బి.సి.2000 నుంచి బి.సి.250 వరకు మూడు రాజవంశాలు పాలించినట్లు ఆధారాలు ఉన్నాయి.ఐతే వీరిని రాజులుగానే గుర్తించారు.కారణం; వారు హొయాంగ్ హో ( yellow river ) పరీవాహక ప్రాంతాన్ని మాత్రమే పాలించారు.1.క్సియా (xia) వంశం బి.సి.2070 - బి.సి.1600 వరకు.2.షాంగ్ (shang) వంశం బి.సి.1600 - 1050 బి.సి.వరకు.3.ఝౌ ( zhou) వంశం బి.సి.1050- 256 బి.సి.వరకు పాలించాయి.వీరి గురించి సమాచారం ,ఎముకలు,వెదురుదబ్బలు ,కంచు పాత్రలపై చెక్కిన లిపులచేతను ,కొన్ని సమాధులలో లభ్యమైన అవశేషాల ద్వారా
లభ్యమైనది.ఇవి కాక దక్షిణాన 'చు ' (chu) అనే రాజ్యం ,ఇంకా కలహించుకొంటూ ఉండే చిన్న రాజ్యాలు కొన్ని ఉండేవి.(warring states)
చైనా వారికి మన లాగ మతాలు,వేదాంతాలు లేవు.వారికి కొన్ని నమ్మకాలు ఉండేవి.పిత్రుదేవతల ఆరాధన ముఖ్యం.(ancestor worship) బి.సి.6,5,శతాబ్దుల్లో కంఫుషస్ (confushiyas) ,లాత్సె (Laotse) ,మెంజి (mencius) అనే తత్వవేత్తలు నీతిసూత్రాలు,సమాజనియమాలు,ప్రవర్తనావళి ,రచించారు.బోధించారు.వారి కాలంలో ప్రసిద్ధి కాంచకపోయినా ,తర్వాత కాలంలోను, ఈనాటికి కూడా చైనీయ సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయి.
క్రీ.పూ.256 లో చైనాలో మొదటి సామ్రాజ్యం స్థాపించబడి చైనాలో అత్యధిక భాగం తన ఏలుబడి లోకి తెచ్చుకున్నది.ఈ వంశం పేరు క్విన్ లేక చిన్ .ఇతడు తనని చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు.(huyangDi).తర్వాతి చరిత్ర మరొకమారు తెలియజేస్తాను చైనా చరిత్ర మనకెందుకు అని చాలా మంది అనుకోవచ్చును.కాని ఈ క్రింది కారణాలవలన అది మనకు ముఖ్యం.
1.టిబెట్ని ఆక్రమించుకోడం చేత చైనా మనకు పొరుగు దేశం ఐనది మనకు,వాళ్ళకు సరిహద్దు తగాదాలు ఉన్నవి.2.1962 లో మనపై దండయాత్ర చేసి ఆక్సాఇచిన్ ప్రాంతం ఆక్రమించింది.అరుణాచల్ తనదే అంటున్నది.3.మనకు విరోధి ఐన పాకీస్తాన్ కు బలమైన సప్పోర్టు ఇస్తూ ఉంటుంది.4.మనం కూడా క్రమంగా అగ్రరాజ్యంగా ఎదుగుతున్నాము.అందుచేత భారత్,చైనాలు అనేక రంగాల్లో పోటీ పడే అవకాశం ఉంది.5.మనదేశంలో చైనా అనుకూల వర్గాలు,లాబీలు ఉన్నాయి.అవి మన దేశంలో అస్థిరత్వం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.
-----------------------------
2 కామెంట్‌లు:
బాగుంది. అలాగే మీరు ఉదాహరించిన మన షట్చక్రవర్తుల గురించి కూడా తెలిపితే సంతోషం.
mana desam china anukula vargalla ? evaru sir vaallu
:venkat
కామెంట్‌ను పోస్ట్ చేయండి