10, డిసెంబర్ 2012, సోమవారం

Backwardness




 వెనకబడిన వాళ్ళం,వెనకబడ్డ ప్రాంతం అని చెప్పుకోడం ఇప్పుడు ఒక అలవాటయింది.ఉత్తరాంధ్ర(నాది ఆ  ప్రాంతమే ఐనా )బాగా వెనకబడింది అంటుంటారు.కాని నేను అలా అనుకోను.ఈ ప్రాంతంలో  వర్షాలు బాగానే పడతాయి.ఏరులు,వాగులు చాలాఉన్నవి.పంటలు బాగానే పండు తాయి.ఇటీవల విద్యాలయాలు,ఆస్పత్రులు ,బాగావృద్ధిచెందాయి.పర్యాటక రంగం కూడా పెరుగుతున్నాది.మధ్యకోస్తా ఆంధ్రులు ఇక్కడ కొండలు,అడవులు ఉండటం చేత మీరు వెనకబడ్డారని అంటారు.అవి ఉండటం అదృష్టం,అందం.అడవులు ,కొండలు లేని పశ్చిమ గోదావరి,కృష్ణా ,గుంటూరు జిల్లాలకన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు  అందంగాఉంటాయి.గణాంకాల ప్రకారం కూడా అంత పెద్ద తేడా ఏమీ లేదు.తెలంగాణా జిల్లాలు కూడా (కొంచెం తరతమ భేదాలు తప్పించి ) వెనకబడలేదని నా అభిప్రాయం.
  

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

sir,

daya chesi mee email id cpbrownsevasamithi@yahoo.com ki pampandi. memu oka mail pampa dalachukunnaamu.

dhanyavaadamulu
n chandra sekhar
bengaluru
9845717166

Jai Gottimukkala చెప్పారు...

మచ్చుకు కొన్ని గణాంకాలను చూద్దాం. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల జనాభా 93 లక్షలయితే ఉభయ గోదావరి జిల్లాల జనాభా 91 లక్షలు. ఈ రెండు ప్రాంతాలు జనాభాలో దాదాపు సమానం.

ఉత్తరాంధ్ర సాలీనా వర్షపాతం 1,165 మిమి అయితే ఉభయ గోదావరిలో ఏడాదికి 1,185 మిమి వర్షం పడుతుంది. ఈ విషయంలోనూ రెండు ప్రాంతాలు దాదాపు సమానమే.

సాగునీటి విషయానికొస్తే ఉత్తరాంధ్రలో ఖరీఫ్ పంటలో కేవలం 186,000 హెక్టేరులు కాలువల ద్వారా సాగు అవుతాయి. రెండో పంటలో ఉత్తరాంధ్రలో 80,000 హేక్తేరులకు నీళ్ళు లభ్యం. అంటే మొత్తం 266,000 హెక్టేరులు. అదే ఉభయ గోదావరి జిల్లాలలో రెండు పంటలలో 370,000 హేక్తేరులకు కాలువ నీళ్ళు (మొత్తం: 740,000) అందుతాయి.

ఉత్తరాంధ్ర సాలీనా వారి పంట 740,000 టన్నులయితే ఉభయ గోదావరి జిల్లాలలో దీనికి దాదాపు నాలుగు రెట్లు (2,846,000 టన్నలు) వరి పండుతుంది.

ఈ లెక్కలు చూసాక గణనీయమయిన తేడాలు ఉన్నట్టు మీరు ఒప్పుకుంటారని ఆశిస్తాను. ప్రస్తుతానికి కారణాలు పక్కన బెడదాం. అసలు తేడాలు ఉన్నాయని అంగీకరిస్తే, కారణాలు తరువాత వెతకొచ్చు.

అజ్ఞాత చెప్పారు...

పశ్చిమగోదావరి జిల్లాలో, తూర్పుగోదావరిజిల్లాలో అడవులు లేకపోవడం ఏంటి? విస్తారమైన అటవీప్రాంతం ఉంది.