18, జనవరి 2012, బుధవారం

sandeham.




  ఒక సందేహం;వాల్మీకి  రామాయణం,వ్యాసభారతం ,పూర్తిగా తెలుగులో చదివాను.కాని అందులో ఎక్కడా వ్రాత writingఉన్నట్లు దాఖలా లేదు.ఒకరు ఇంకొకరికి కబురు పెట్టినా ,రాయబారం పంపినా 'నా మాటగా ఇలా చెప్పు 'అని మాటలతోనే సందేశం పంపే వారు కాని లేఖలు రాసినట్లు నిదర్శనాలు లేవు.ఆ కాలం లో వ్రాత లిపి ఉండేదా ?మొదటి సారిగా మనకు అశోకుడి శాసనాల్లో నే వ్రాత ( బ్రాహ్మీ లిపి అనుకొంటాను.క్రీ.పూ.300 ) సింధు నాగరకతా శిథిలాల్లో ముద్రల పై లిపి కనిపిస్తుంది.కాని అది ఆర్యనాగరకత కాదు ,ద్రావిడ లేక దస్య నాగరకత అంటారు.( క్రీ.పూ.2500 )ఈ విషయానికి మన పండితులు ,పౌరాణికులు సమాధానం చెప్పలేరు.చరిత్ర పరిశోధకులు కాని,వారిని బాగా చదివినవారే చెప్పగలరు.మన  బ్లాగు మిత్రులెవరైనా తెలిసినవారుంటే విశదీకరిస్తే సంతోషిస్తాను.--రమణారావు.  

1 కామెంట్‌:

anrd చెప్పారు...

క్షమించాలి ఇవన్నీ మీకూ తెలుసు.

వాల్మీకి మహర్షి రామాయణాన్ని వ్రాసినట్లు , భారతాన్ని వ్యాస మహర్షి చెబుతుంటే వినాయకుల వారు వ్రాసినట్లు పెద్దలు తెలిపారు .

ఇక పురాణేతిహాసాలలోని సంఘటనలను బట్టి చూస్తే, రామాయణంలో సీతాన్వేషణ కోసం వారధి నిర్మించే సమయంలో రాళ్ళమీద " రామ " అనే అక్షరాన్ని వ్రాసినట్లు , ఆ తరువాతే ఆ రాళ్ళు నీటి మీద తేలాయని అంటారు. అప్పుడు వానర సైన్యం ఆ రాళ్ళను మోయగలిగారని పెద్దలు తెలిపారు. . ..