EPICSఎపిక్ అంటే గ్రీకు భాషలో కథ,కావ్యం ,అని అర్థం.ఐతే అన్ని కథలూ, ,కావ్యాలూ ,ఎపిక్స్ కాలేవు.తెలుగులో వీటిని మహాకావ్యాలు అనవచ్చును.ప్రాచీన గ్రీకు భాషలో హోమర్ రచించిన 'ఇలియడ్, ఒడెస్సీ ' ,అపొల్లోనియస్ 'ఆర్గొనాటికా',లాటిన్ భాషలో వర్జిల్ కావ్యం 'ఏనియడ్ 'ఈ కోవలోకి వస్తాయి.మొదట్లో వీటిని గానం చేసేవారు. తర్వాతి కాలం లోనే గ్రంథస్థం చేసారు.మన రామాయణం ,మహాభారతం ప్రపంచంలోనే గొప్ప ఎపిక్స్ గా పరిగణింపబడుతున్నవి.ప్రాచీన పర్షియా రాజవంశాల కథ 'షానామా' ఒక ఎపిక్ .ఆ దేశాల్లో అప్పటి మతాలు అంతరించి పోవడం వలన వాటిని కేవలం గొప్ప కావ్యాలు గానే భావిస్తారు.మన దేశంలో హిందూ మతం ఇంకా ప్రబలంగా ఉండుట వలన రామాయణ ,భారతాలను పవిత్ర మతగ్రంథాలుగా భావిస్తాము.వీటి మీద అనేక చర్చలు, వ్యాఖ్యలు ,వాదోప వాదాలు ,ఖండనమండనలు,జరుగుతున్నవి.కాని వాటి జోలికి పోదలచు కోలేదు.ఇన్ని వేలసంవత్సరాల పిదప కూడా ఇవి ఇంత ప్రాచుర్యం లో ఉండటానికి కారణమేమిటి?ఎపిక్స్ ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే అర్థమౌతుంది.
1,ఎపిక్ ఆ దేశపు ,జాతి, ఆశయాలను, ఆవేశాలను,లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.
2.దీర్ఘమైన కథతో మలుపులు తిరుగుతూ ,అనేక సంఘటనలతో నిండి ఉంటుంది,
3.హీరో, హీరోల సాహస కృత్యాలు చిత్రింపబడి ఉంటాయి.శౌర్యం, ప్రతాపం ముఖ్యం.
4.చాలా ఎపిక్స్ లో దేశ కాలాల కేన్వాసు బాగా విస్తరించి ఉంటుంది.
5.అన్నికాలాలకీ ,దేశాలకి, అన్వయించే విషయాలు కూడా కొన్ని ఉంటాయి.
6.నాయికా,నాయకులు అనేక కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని చివరకు విజయం సాధిస్తారు.
7.కొన్ని అద్భుతాలు,అతీంద్రియ శక్తులు ,దేవతల ప్రవేశం ఉండవచ్చును.
8.మానవులు ఇప్పటికీ యుద్ధప్రియులే. ఎపిక్స్ లో సాదారణంగా చివర్లో మహా యుద్ధం,అందులో నాయకుడు విలన్ల మీద అంతిమ విజయం సాధిస్తాడు.
9.దీర్ఘ ప్రయాణాలు, వర్ణనలూ ఎక్కువగా ఉంటాయి.
పై కారణాల వలన ఈ ఎపిక్స్ అన్నీ ఇప్పటికీ పాపులర్ గా ఉన్నాయి.పైగా మన రామాయణ భారతాలు ,బైబిలు ,పవిత్ర మతగ్రంథాలు గా కూడా గౌరవింప బడటం చివరి కారణం.నేటి సినిమాల్లో కూడా ఇవే సూత్రాలను అనుసరించడం గమనించ వలసిన విషయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి