20, జనవరి 2012, శుక్రవారం

roots.contd.




 తిరుగు ప్రయాణం విజయనగరం మీదుగా.అక్కడ కొంచెం సేపు ఆగాము.అప్పటికే చీకటి పడింది.సెలవురోజు.ఇంతకు ముందు చూసిందే ఐనా మా వాళ్ళు కోసం కోట చూడ్డానికి వెళ్ళాము.గేట్లు మూసివున్నాయి.వాచ్మన్ ట్రాప్ డోర్ ద్వారా లోపలికి తీసుకు  వెళ్ళాడు.కోటని కా లేజికి ఇచ్చేసారు.సెలవురోజు, రాత్రి, గదులన్నీ మూసివున్నాయి. పైనుంచే చూసాము.కోట ఆవరణ చాలా పెద్దది.బిల్డింగులు కూడా పెద్దవీ ,మూడు అంతస్తుల్లో ఉన్నవి.కోట ప్రహరీ గోడ ఎత్తుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది.కోట శిథిలం కాలేదు .బాగానే ఉంది.కాని చుట్టూ ఉన్న కందకం పూడ్చేసి గోడ దా కా ఏవో ఇళ్ళూ, దుకాణాలూ కట్టడం వలన బయట నుంచి కోట బాగా కనబడలేదు. ముఖద్వారం ఎదురుగా మాత్రం ఖాళీగా ఉంది.కన్యాశుల్కం ఫేం బొంకులదిబ్బ  లేదు.గంటస్తంభం (ఒక landmark )ఉంది.పెద్దచెరువు చుట్టూ చెట్లు పెంచారు.గట్టు మీద రాజుల విగ్రహాలు  ప్రతిష్ఠించారు.అన్నట్టు పీ.వీ.జీ.రాజుగారి విగ్రహమూ,ఒకప్పటి రాణి వాసం భవనాలూ కోటలోనే ఉన్న వి చూసాము.విజయనగరం చాలాకాలం    దాకా,పాతగా, అభివృద్ధి లేకుండా ఉండేది.కాని ఇటీవల ,ముఖ్యంగా రైల్వే స్టేషన్ వైపు  పెద్దరోడ్లు,మేడలు,ఆఫీసులు,హోటల్సు, కాలనీలు బాగా అభివృద్ధి చెందాయి.     గురజాడవారి ఇల్లు కూడా చూసాము.మంచి స్థితి లోనే ఉంది.మీరెవరైనా ఉత్తరాంధ్రకి వస్తే వైజాగ్ మాత్రమే కాక విజయనగరం కూడా చూడండి. ఒక శోచనీయమైన విష యమేమంటే అప్పటి కత్తులూ కటార్లూ కవచాలు దుస్తులూ ఇతర వస్తువులు  చాలా వరకూ విశాఖపట్నం,హైద్రాబాద్  వంటి చోట్లకి మ్యూజియంస్ కి తరలించేసార ట.  
  

1 కామెంట్‌:

కథా మంజరి చెప్పారు...

చాలా బాగా రాసారు. మీరు చూసిన విగ్రహాలున్న స్థలం ఆయా రాజుల సమాధులని నేను విన్నాను.

బొంకుల దిబ్బ లేక పో లేదు. అక్కడ ఇప్పుడు కూరగాయల మార్కెట్ నడుస్తోంది. ఒక విదేశీయ ఇంజనీరు అక్కడ నీళ్ళు పడతాయని చెప్పి చాలా లోతు వరకూ గొట్టాలు దించాడుట. ఎంత లోతుగా వెళ్ళినా నీరు పడ లేదుట. ఒక నాటి రాత్రికి రాత్రి ఆ విదేశీయ ఇంజనీరు అవమాన భారంతో పరారయాడుట. నీరు పడడం ఒట్టి బొంకు అని జనం అనుకుంటూ ఉండే వారుట. అందుకే ఆ చోటుకి బొంకుల దిబ్బ అన పేరు వచ్చిందంటారు.

మరొక కథనం ప్రకారం అక్కడ పనీ పాటూ లేని జులాయిలు చేరి బొంకులాడుంటూ ఉండడం చేత దానికా పేరు వచ్చిందంటారు.

విజయ నగరం గురించి ఎవరు రాసినా నాకు చాలా ఇష్టం. అందుకు మీకు నా ధన్యవాదాలు.