ఈ సంక్రాంతి శుభ వారంలో మరొక సారి అందరికీ శుభాకాంక్షలు.-ముఖ్యంగా దూర ంగా ఇతర రాష్ట్రాల్లో,విదేశాల్లో వున్న వారికి.మా శ్రీకాకుళంలో మాత్రం బాగా చలిగా వుంది.శీతాకాలాన్ని,సంక్రాంతిని ముందే పద్యాల్లో వర్ణించి వుండటం చేత మళ్ళీ వ్రాసి కవిత్వంతో విసిగించదల్చు కో లేదు.ఈ రోజుల్లో ఇంతకు ముందు లాగ వచ్చే జానపద కళా కారులు,భిక్షుకులు, బాగా తగ్గిపోయారు.గంగిరెద్దులవాళ్ళు మాత్రం కొందరు వస్తున్నారు.కాని వాళ్ళు సినిమా పాటలు సన్నాయి తో వాయిస్తున్నారు !
మా ఇంటి ఆవరణలో పిల్లలు పెద్ద భోగి మంట వేసారు.ఈ రోజుల్లో independent గా ఇల్లు,చుట్టూ తోట ఉండటం లగ్జరీ అంటున్నారు.మాకలాంటి ఇల్లు ఉండటం ఆనందం గాఉంది.కాని, హైదరాబాదు,విశాఖ, లోనేగాక, జిల్లా కేంద్రాల్లోను, ఇతర పట్టణాల్లోను కూడా ఈ అపార్టుమెంటు కల్చర్ వ్యాపిస్తూ ఉండటం శోచనీయమే.చివరికి పల్లెల్లో మాత్రమే అలాంటి ఇళ్ళు మిగులుతాయేమో .కాని ఏమిచేస్తాము ?భూమి,నిర్మాణ వ్యయం కొండెక్కడం తో తప్పదనుకొంటాను.
2 కామెంట్‌లు:
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
సంక్రాంతి శుభాకాంక్షలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి