12, జనవరి 2012, గురువారం

GOOD WISHES.


 

  ఈ సంక్రాంతి మహోత్సవావసరమందీ చంద్రికా రాత్రులన్,
  ఏ సీమన్ గనినన్ వినోదములతో నింపారు గేహమ్ములన్,
  రాసుల్ పోసిన ధాన్య సంపదలతో రాణించు గ్రామమ్ములున్,
  భాసించెన్ హిమశీత వాయువులు  ,సద్భావమ్ము వర్ధిల్లగన్
              -----------------
    పౌష్యలక్ష్మిచే వెలుగునీ ప్రకృతి యెల్ల
    'బ్లాగు '  మిత్రులందరికి సౌభాగ్య మలర
    ఆయురారోగ్య సంపద లమరు గాత !  
    అని శుభాకాంక్ష లందింతు నమల బుద్ధి ,
           -------------- 

1 కామెంట్‌:

కథా మంజరి చెప్పారు...

మీకు, మీ కుటుంబ సభ్యులకు మా సంక్రాంతి శుభాకాంక్షలు. పౌష్య లక్ష్మికి స్వాగతం పలుకుతూ మీరు వ్రాసిన పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.