మాది మొదట చామలాపల్లి అనే పల్లె,అగ్రహారం.మా తాతగారి కాలం లోనే దాన్ని విడిచి వైజాగ్లో సెటిలయ్యారు.మా భూములు 'జమిందారీ ,ఇనాందారీ, రద్దు చట్టం క్రింద 'స్వరాజ్యం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రైతులకు పంచి పెట్టింది.ఒక తోట ,ఇల్లు మిగిలి ఉంటే మా నాన్నగారు అమ్మేసారు.అందువలన ఆ వూరి మీద ఆసక్తి లేక జీవితంలో ఎన్నడూ వెళ్ళి చూడలేదు.ఇన్నాళ్ళకి చాలా అలస్యంగా ఎందుకో బుద్ధి పుట్టి ,మా అబ్బాయి,మనమడు,మనమరాలుతో మా కారులో వెళ్ళాము.శ్రీకాకుళం నుంచి రమారమి 100 కి.మీ.దూరం.విజయనగరం నుంచియస్. .కోట కి వెళ్ళే దారిలో ఉంది,సంక్రాంతి రోజులు కాబట్టి చల్లగా,దారి పొడుగునా పచ్చగా మనోహరంగా ఉంది.ఊరి చుట్టూ కూడా పొలాలు,చెట్లు,తోటలు ఉన్నాయి.గోస్తని యేరు దగ్గరే. తాటిపూడి రిజర్వాయర్ కొంచెం దూరంలో ఉంది.మరికొంత దూరంలో తూర్పు కనుమలు.
ఊళ్ళో బ్రాహ్మణ వీధిలో 50-60 గడపలు ఉన్నాయి.కాని చాలావరకు ఖాళీ.విజయనగరం,విశాఖపట్నం,హైద్రాబాద్, అమెరికాలలో వున్నారట.ఉన్న కొద్దిమందీంధువుల్ని కలిసాము.ఊరిదాకా మంచి తారురోడ్డు ఉంది.ఊళ్ళో సిమెంటు రోడ్లు ఉన్నాయి.కరెంటు ఉండటం వల్ల అందరి యిళ్ళలో విద్యుత్ దీపాలు,పంకాలు,ఫ్రిజ్లూ ,ఫోన్లూ ఉన్నాయి,కొంతమందికి కార్లు,ఏ.సీ.లు ,మోటారు సైకిళ్ళు ఉన్నవి.ఊర్లోనే ఒక స్కూలు కూడా ఉంది.
రైతుల ఇళ్ళు కూడా 100 గడపల దాకా ఉన్నాయి.పూరిళ్ళు దాదాపు మాయం ఔతున్నవి.సిమెంటు ,ఇటుకల తో కట్టిన డాబా ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయి.ట్రాక్టర్లు ,మోటారు పంపులూ వాడుతున్నారు. ఊళ్ళో మంచి నీటి కొళాయిలు కూడా ఉన్నాయి.
బ్రాహ్మల ఇళ్ళు మాత్రం పాతవే ఉన్నా గట్టిగానే ఉన్నాయి.ఇటుకలు,మట్టితో నిర్మించారు.కొన్ని పెంకుటిళ్ళు,కొన్ని డాబా యిళ్ళు.to be continued.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి