చైనా -1949-2012 ఈ కాలంలో కమ్యూనిస్టు పాలన కొనసాగింది.దీనిని rough గా 1950 నుంచి 1980 వరకు 30 సం;మావో యుగంగాను ,1980 నుంచి 2010 వరకు మావో అనంతరయుగం(post Mao era)లేక సంస్కరణల యుగంగా పేర్కొనవచ్చును.1976లో మరణించేదాకా మావో తిరుగులేని నియంత.అతని కమ్యూనిస్టు భావజాలం ప్రకారం ,ప్రయివేటు కమతాలు రద్దు చేయబడి,ప్రభుత్వ పరమై ,కమ్యూనిస్టు కార్యకర్తల నిర్వహణలో గ్రామ రైతు సహకారసంఘాలచే వ్యవసాయం చేయబడింది. ( communes) అందరికి కాంటీన్ల ద్వారా ఉచితంగా భోజన వసతి కల్పించారు.మొదట్లో ఈ విధానం బాగానే ఉన్నట్లు కనిపించింది.పెద్ద రైతులను,భూస్వాములను ప్రజాశత్రువులు గా ప్రకటించి శిక్షించారు.చాలామందిని చంపివేసారు.
ఈ ఉమ్మడి వ్యవసాయం విఫలమైనది.కష్టించి పనిచేసే రైతులలో సోమరితనం ప్రబలింది.కార్యకర్తలు ఉత్పత్తి తప్పుడు లెక్కలు ,చూపించారు.పెరుగుతున్న జనాభా కి తగినంత ఆహార ఉత్పత్తి జరగలేదు .ఐనా పట్టణాలకి ఆహారం విధిగా ఎగుమతి చేయవలసి వచ్చింది.అందుచే గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వచ్చింది.లక్షలాది ప్రజలు తిండి లేక మరణించారు
పరిశ్రమల్లో త్వరిత ప్రగతి సాధించాలని ,కుటీరపరిశ్రమల ద్వారా దేశమంతా ప్రయత్నించారు.కాని ఆధునిక వస్తుసముదాయాన్ని,ఉక్కు వంటి వాటిని పాత కొలుముల్లో (furnaces of old model) తయారు చేసినవాటికి నాణ్తత లోపించి ,గిరాకి లేక (massproduction of big modern machines )ముందు విఫలమైనవి.దీనినే గొప్ప ముందంజ ( great leap forward ) అన్నాడు.
మరొక ప్రతిపాదన కూడా ఆచరణలో విఫలమైనది.మావోయిజాన్ని దేశంలో బాగా ప్రచారం చేసి ,ఆచరించడానికి విశ్వవిద్యాలయాలు,కళాశాలలు ,మూసివేసి అధ్యాపకుల్ని,విద్యార్థులను గ్రామాలకి తరలించారు.ఎర్రసైనికులు (red guards ) అనేపేరుతో యువతీ యువకుల్ని తయారు చేసారు.వాళ్ళు,విప్లవవ్యతిరేకులనుకొన్న వారినందరినీ శిక్షించ సాగారు.
ఐతే మావో యుగంలో ఏమీ సాధించలేదని చెప్పలేము.భారీ పరిశ్రమలు,విద్యుత్ ప్రాజక్టులు నెలక్ల్పబడినవి.(ప్రభుత్వరంగంలోనే) .విద్య,వైద్య సేవలు ఉచితం చేయబడినవి.స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వబడినవి.చైనా మిలిటరీ బలం బాగా వృద్ధి చెందింది.రోదసీ,అణు ,పరిశోధనలు విజయం సాధించాయి.(space and atomic research) సోవియట్ యూనియన్ ఈ విషయాల్లో చైనాకి చాలా సహాయం చేసింది.
1976 లో మవో సె జంగ్ మరణించాక అధికారం కోసం పోరాటం జరిగింది.మావో భార్య జియాంగ్క్వింగ్ ( jiyangqing)ఆమె అనుచరులు(gang of four ) ప్రయత్నాలని వమ్ముచేసి డెంగ్ సి యా వో పింగ్ (Deng tse yao ping ) అతని సహచరులు అధికారం చే జిక్కించుకొన్నారు.జియాంగ్ వర్గం అతివాదులు,డెంగ్ వర్గం మితవాదులు.(మిగతా మరొక సారి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి