12, ఏప్రిల్ 2012, గురువారం

China-contd.-11




  1978లొ డెంగ్-సియాఓ -పింగ్ తన అభిప్రాయాల ప్రకారం ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు.అంతకు ముందే సోవియట్  యూనియంకి ,చైనాకి అభిప్రాయభేదాలు కలిగాయి.1972 లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ విదేశాంగ మంత్రి కిస్సింజెర్ సలహాతో బీజింగ్ వెళ్ళి మావో -సె - జంగ్  ని కలుసుకొని రహస్య చర్చలు జరిపాడు.
  డెంగ్ సూత్రాలలో ఎక్కువగా ఉదహరింప బడే వాటిని బట్టి అతని విధానాలు అర్థమౌతాయి.1.ధనం సంపాదించడం పాపం కాదు.(To get rich is no sin )2.ఎలకల్ని పట్టుతూ వుంటే పిల్లి తెల్లగా వున్నా నల్లగా వున్నా ఫరవా లేదు. (It does not matter whether the cat is black or white as long as it catches mice ) ఈ ఆర్థిక సంస్కరణల ద్వారా జరిగిన మార్పులు; 1.వ్యవసాయం మళ్ళీ ప్రైవేటు రైతు కుటుంబాల చేతులకు స్వాధీనమై ,ఉత్పత్తి పెరిగింది. 2.పరిశ్రమలలో ప్రైవేటు పెట్టుబడి ప్రోత్సహించుట వలన అవి బాగా పెంపొంది ఎక్కువ ఉత్పత్తిని సాధించాయి.3.విదేశీ పెట్టుబడులను,సాంకేతిక సహాయాన్ని ఆహ్వానించుట వలన సంపద, ఉత్పత్తుల నాణ్యత పెరిగింది.4.తీరప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండలులను ఏర్పాటు చేసి నిబంధనలను సడలించడం వలన అక్కడ ఎగుమతి, దిగుమతులు బాగా జరగ సాగాయి. చైనాలో కార్మికశక్తి (Labour power ) చవకగా లభ్యం కాబట్టి ,చవకగా అనేక వస్తువులు ఉత్పత్తి చేసి అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసి విశేషంగా విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్లలో చైనా ఆర్జించింది.
  1980 నుండి గత 30 ఏళ్ళుగా చైనా 10 % జాతీయోత్పత్తి లో అభివృద్ధి సాధించింది.( Fastest growth in G.D.P.) ఇప్పుడు ప్రపంచంలో ఆర్థిక, సైనిక, రంగాలలో మూడవ ప్రబలశక్తిగా రూపొందింది. విద్యా,ఆరోగ్యరంగాలలో కూడా మంచి అభివృద్ధి సాధించింది.
  కాని,చైనాలో స్వేచ్చ,ప్రజాస్వామ్యం లేవు.20 సం;; క్రితం బీజింగ్లో విద్యార్థులు స్వేచ్చ,ప్రజాస్వామ్యం కోసం జరిపిన ఆందోళనని ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. టిబెట్ ,సింకియాంగ్ లలో స్వయమ్నిర్ణయాధికారం కోసం జరిగిన తిరుగుబాట్లను తీవ్రంగా అణచివేసింది.మన దేశంలోవలె స్వెచ్చాయుత ఎన్నికలు లేవు.
   రాజకీయంగా కమ్యూనిస్టు ఏకపక్ష నియంతృత్వం ,ఆర్థికంగా ప్రైవేటు పెట్టుబడిదారి వ్యవస్థ ; ఇది నేటి చైనాలో పరిస్థితి.
   (వచ్చే సారి నా అభిప్రాయాలతో చైనా గురించి ఈ బ్లాగుల పరంపరను ముగిస్తాను.)   

2 కామెంట్‌లు:

Vamshi Pulluri చెప్పారు...

చైన గురించి క్లుప్తంగ, చాల చక్కగ వివరించరు. మీరు రాసిన పద్దతి చాల బాగుంది. ముఖ్యమైన హిస్టరి ని మన వాల్లు ఎందుకు నెగ్లెక్ట్ చేసరో..మన చదువుల్లో ఆ సబ్జెచ్క్ట్ ని చాల చెత్త గా మార్చివేసారు.

Vamshi Pulluri చెప్పారు...

చైన గురించి క్లుప్తంగ, చాల చక్కగ వివరించరు. మీరు రాసిన పద్దతి చాల బాగుంది. ముఖ్యమైన హిస్టరి ని మన వాల్లు ఎందుకు నెగ్లెక్ట్ చేసరో..మన చదువుల్లో ఆ సబ్జెచ్క్ట్ ని చాల చెత్త గా మార్చివేసారు.