3, మే 2012, గురువారం

national film awards



 ఈ రోజు జాతీయచలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని టీ.వీ.లో కొందరైనా చూసివుంటారు.ఫిలింఫేర్ అవార్డులలాగ glamour లేకుండా అంతా అఫీషియల్ గా జరిగింది.కాని ఈ జాతీయ అవార్డులు ని చాలా ప్రముఖంగా,ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తారు.ఎక్కువగా మళయాళీ,కన్నడ ,బెంగాలీ ,మరాఠీ పేర్లే వినిపించాయి.ఒక్క తెలుగు పేరు కూడా వినిపించకపోవడం తో మనస్సు చివుక్కుమంది.మన తెలుగు చలన చిత్రాల ప్రమాణాలు 'కళాత్మకంగా ' చూస్తే ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమౌతుంది.
   కాని ఒక విషయం రాయదలుచుకొన్నాను.వచ్చే ఏడాది అయినా దర్శకుడు కె.విశ్వనాథ్ గారికి ప్రతిష్ఠాత్మక మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ,ఆం.ప్ర.ప్రభుత్వము గట్టిగా కృషి చెయ్యాలి.అందుకు ఆయన అన్ని విధాలా అర్హుడు కాబట్టీ.
  రెందవ విషయం; మొదటి తెలుగు టాకీ 'ప్రహ్లాద ' ను ,సాంఘిక చిత్రాలకి మార్గదర్శకంగా 'గృహ లక్ష్మి ' చిత్రాన్ని తీసిన H.M.రెడ్డి పేరిట  మన రాష్ట్రంలో ఏ అవార్డూ లేక పోవడం శోచనీయం. ఇకమీదైనా ఆలోటు తీరుతుందని ఆశిస్తున్నాను.

1 కామెంట్‌:

కథా మంజరి చెప్పారు...

మీ సూచన చాలా బాగుంది విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావాలని మేమూ కోరుకుంటున్నాము.