నందన నామవత్సర మమంద మనోజ్ఞ మహానుభూతులన్
అందరు బంధు మిత్రులకు నందగజెయుత మంచు గోరుచున్
అందములొల్కెడి జీవన మరందము గ్రోలుడి యంచు దెల్పెదన్
డెందము పుల్కరింపగ ,స్వదేశ విదేశ ప్రజాళి కంతకున్ .
----------------------
నవయుగాదికి నాందిగా నందనాఖ్య
వత్సరాంగన అరుదెంచె ,పల్లవసుమ
శోభిత దుకూలమును దాల్చి శుభములీయ
నెల్లవారికి ,స్వాగత మ్మీయ రండు.
------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి