కన్నడభాషలో 'పరిసరదె కతగళు 'అనే పుస్తకాన్ని శ్రీ శాఖమూరు రామగోపాల్ గారు 'పర్యావరణ కథలు ',అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసారు.కు.వెం.పు.(ప్రసిద్ధరచయిత,ప్రొఫెసర్,జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత ) గారి కుమారుడు పూర్ణ చంద్రతేజస్వి కన్నడంలో రాసినవి.ఆయన స్వచ్చందంగా ,నగరాలకు దూరంగా పడమటి కనుమల దట్టమైన అడవుల్లో,శృంగేరికి దగ్గరలో పొలంకొని వ్యవసాయం చేస్తూ అక్కడే ఉండిపోయారు.అక్కడ తన అనుభవాలను,యదార్థ సంఘటనలనే చిన్న కథలుగామలచి రచించారు.ఆ ప్రాంతపు వాతావరణం,అడవులు,వన్యప్రాణులు,పల్లెప్రజలు,వాళ్ళ అలవాట్లు, నమ్మకాలు,చెట్టుచేమలు,జీవజాలం (flora and fauna )సమస్తం మనం తెలుసుకోవచ్చు.ఇందులో ఆయన నవ్వుపుట్టించే ( misadventures ) ఘటనలు కూడా ఉన్నాయి.క్రమంగా అంతరిస్తున్న వన్యప్రాణులు,తరిగిపోతున్న అటవీ సంపద ,మాసిపోతున్న పాత వృత్తులు,కులాలు,జీవన శైలులు గురించి రచయిత ఆవేదన స్పష్టమౌతుంది. వ్యవసాయదారుల పరిస్థితిని తెలిపే ఈ వాక్యాలు చూడండి. '' మైసూరు నుంచి వ్యవస్థను చావనీకుండా వ్యవసాయవృత్తిని చేపట్టిన నాకు అతను వ్యవసాయాన్ని బాల్ బాయ్ ఉద్యోగంకన్న తక్కువ స్థాయిలో ఉంటుంది అని చెప్పడం సహించలేదు నామనస్సుకు.అయితే నా ముందు జీవితం దిగులయ్యేట్లుగా ,అతను భవ్యభారతదేశంలో అందరిచే తిరస్కరించబడిన రైతువర్గం లోని దారుణ స్థితిగతుల సత్యమ్ను తెలుపుతున్నోడి లాగ నాకు అంపించింది. ''
రామగొపాల్ గారు రాయచూరు జిల్లాలో కొన్నాళ్ళు వ్యవసాయం చేయడంవలన,కన్నడభాష,దాని నుడికారం తెలుసుకొనడం వలన తేజస్విగారి యీ కన్నడ పుస్తకాన్ని చక్కగా అనువదించగలిగారు.వన్యప్రాణి ప్రేమికులూ,అడవులు,పర్యవరణ ప్రియులూ తప్పక చదవవలసిన కథలపుస్తకం ఇది.దీనిని తెలుగువారికి అందించిన శ్రీ శాఖమూరు రామగొపాల్ గారిని అభినందిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి