6వ దశకంలో హిచ్కాక్ శీతలయుద్ధం (cold war between America and Soviet Union) నేపథ్యంలో రెండు చిత్రాలు తీసాడు.1.టొపాజ్ Topaz.దీనికి లియాన్ యూరిస్ నవల ఆధారం.టొపాజ్ అన్నది ఒక కోడ్ నేము.మధ్యలో రచయితకి,దర్శకుడికీ వచ్చిన భేదాభిప్రాయాల వల్ల అంకున్నట్లు రాలేదు.అంతగా విజయం సాధించలేదు.క్యూబా అమెరికా పక్కనే ఉన్న చిన్న కమ్యూనిస్ట్ దేశం.అక్కడ సోవియెట్ తన క్షిపణుల్ని పెట్టడం వలన ప్రపంచయుద్ధం వస్తుందని భయపడ్డారు.చివరకు రష్యా వాటిని ఉపసంహరించుకోడం వలన ఆ సంక్షోభం తొలగిపోయింది.దీనినే cuban crisis అంటారు.2.టార్న్ కర్టెన్ torn curtain ఇది బెర్లిన్ కమ్యూనిస్ట్ పాలనలో ఉన్నప్పుడు జరిగినట్లు తీసిన కథ.రెండిటి లోను గూఢ చారి చర్యలు,ఎత్తుగడలు,క్షిపణి రహస్యాలు,(missile secrets ) ప్రధానపాత్ర వహిస్తాయి.కథ అనేక మలుపులు తిరుగుతుంది.
తర్వాత మళ్ళీ ఆయన తనకి ఫేవరెట్ కథల వైపు మళ్ళాడు. 1.మార్నీ - ఇందులో జేంస్ బాండ్ గా ప్రసిద్ధిపొందిన షాన్ కానరీ హీరొ. దొంగ అని తెలిసినా మార్నీ అనే అందగత్తె వ్యామోహంలో పడి,ఆమె దొంగ అని తెలిసినా పెళ్ళి చేసుకొంటాడు.కాని frigidity వలన ఆమె కాపురం చేయలేకపోతుంది.అందుకు కారణాలు అన్వేషిస్తూ మార్ని తల్లిని కలుసుకొంటాడు. ఆమె ఒక వేశ్య.మార్ని చిన్నతనంలో ఒక విటుడు తల్లిని గట్టిగా కొడుతూఉంటే సహించలేక వాడిని కత్తితో పొడిచి చంపుతుంది.అప్పటి నుంచి ఆమెకు మగవాళ్ళమీద కోపం.అసహ్యం.చివరికి psychiatric treatment వలన బాగయి హీరోతో కాపురం చేస్తుంది.ఈ సినిమాలో మనస్తత్వ పరిశోధన ,child trauma వంటి విషయాలతో ఉంటుంది.
ఫ్రెంజీ (frenzy) మళ్ళీ లండన్ కూరలమార్కెట్ (covent garden ) ప్రాంతంలో వరుస హత్యల మీద సినిమా.ఇది రీమేక్.ఇద్దరు కవలల్లో ఒకడు హంతకుడు.కాని నిర్దోషి అమాయకుడి మీద ఆరోపణలు ,పోలికలవలన,వస్తాయి.చివరకు అసలు హంతకుడు పట్టుబడతాడు.నెక్ టై హత్యలని పూర్వం నిజంగా జరిగిన ఘటనలే ఈ సినిమాకి
ఆధారం అంటారు.
ఆయన ఆఖరి చిత్రం 1976 లో తీసాడు.కొన్ని టీ,వీ.సీరియల్స్,షోలు కూడా నిర్వహించాడు. 5దశాబ్దాలపాటు (50 సంవత్సరాలపైగా )సాగిన అల్ఫ్రెడ్ హిచ్ కాక్ సినీ జీవితాన్ని అంచనా వెయ్యడం కష్టమే.ఒక రకం (genre) సిన్మాలకి ఆయన పెట్టిందిపేరు.master of suspense అని పేరుగాంచాడు.50 చిత్రాల్ని తీసాడట.అందులో నేను చూసిన కొన్నిటి గురించే రాసాను .ఇప్పటికీ DVD లో దొరుకుతున్నవి .
చివరగా హిచ్ కాక్ చిత్రాల్లోని ప్రత్యేకతలు కొన్ని వివరిస్తాను.1,నవరసాల్లో భయానక,బీభత్స,అద్భుత రసాల్ని ఎక్కువగా కలిగి ఉంటాయి.2.ఉత్కంఠ suspense ప్రధానం.నేరం crime ప్రధానాంశం.కాని ఎక్కువ రక్తపాతం ,పోరాటాలు ఉండవు.3. మంచి నవలల ఆధారంగా చాలా సినిమాలు తీసాడు.4.కథనంలో ప్రావీణ్యం ఉంటుంది.కొన్నిటిలో ప్రారంభంలోనే హంతకుడెవరొ తెలిసినా కథనంతో ఆసక్తి కలిగిస్తాడు.5.కొన్ని సినిమాల్లో ఆఖరి సీను climax అద్భుతంగా ఉంటుంది.(ఉదాహరణకు;
స్ట్రేంజెర్స్ ఒన్ అ ట్రైన్ లో కార్నివాల్,వెర్టిగోలో చర్చ్ శిఖరం,నార్త్ బై నార్త్ వెర్త్ లో
రష్మోర్ పర్వతం ,మాన్ హూ న్యూ టూ మచ్లో కాన్సర్ట్ హాల్ -ఈ దృశ్యాలన్నీ గొప్పగాఉంటాయి. 6.పెద్ద సెట్టింగులు,అనవసరపు సీనులు ఉండవు.7.మామూలు మనుషుల్లో దాగిఉండే దురాశ, క్రౌర్యం వెల్లడిస్తాడు.వాస్తవికతేగాని అభూతకల్పనలు ఉండవు.8.ఈయన సినిమాలు కొన్ని చాలా మలుపులతో, చిక్కుగా ఉండి జాగ్రత్తగా చూడక పోతే అర్థం కావు.
గొప్పవాడయినా ,సామాన్యుడయినా ప్రతి మనిషి జీవితంలో ఒక ఉచ్చదశ ఉంటుంది.
ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ జీవితంలో 1950--1960 మధ్య స్వర్ణయుగం అంటారు.అప్పుడు ఆయన తీసిన సినిమాలు క్లాసిక్స్ గా పరిగణింపబడి శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టాయి.
(సమాప్తం)
1 కామెంట్:
'hitchcock ' తన ప్రతి సినిమా లో ఒక సారి దర్శనం ఇస్తాడు. ఇలా కనిపించి అలా మాయమౌతాడు. ఇది ఒక చమత్కారం. సినిమా లో hitchcock ఎక్కడ కనిపిస్తాడు అని ప్రేక్షకులు ఆసక్తిగా యెదురు చూసే వారట. ఇటీవల అమెరికా లో జరిగిన సర్వే లో ఆయన దర్శకత్వం వహించిన ' vertigo సినిమా ని హాలీవుడ్ బెస్ట్ సినిమా గా పేర్కొనడం జరిగింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి