మా చిన్నప్పుడు 10,12 ఏళ్ళ దాకా మాత్రమే పుట్టిన రోజులు జరిపేవారు.పొద్దుటే తలంటిస్నానం తప్పదు.కొత్తబట్టలిచ్చి కట్టుకోమనేవారు.పూజచేసి దీవించవాళ్ళు.ఏదో ఒక పిండివంటతో భోజనం పెట్టేవారు.అంతా ఇంటిలోనే జరిగిది.ఎవరినీ పిలవడం అదీ ఉండేదికాదు.పెద్దయాక ,పుట్టినరోజు జరుపుకొనేవాళ్ళుకాదు.
కాలక్రమాన అనేకమార్పులు వచ్చాయి.గ్రీటింగ్స్ పంపడం.పదిమందినీ పిలిచి పార్టీ ఇవ్వడం .బహుమతులు,కేక్ కట్చెయ్యడం ఇవన్నీ వచ్చాయి.ఇంకా సంపన్నులైతే ,ఏ 5 స్టార్ హొటల్ లో నో రిసెప్షన్ .పాటలు,డాన్సులు ,ఖరెదైన విందు,gifts ఇలా ఘనంగా చేస్తున్నారు.సరే,ఎవరి ఇష్టంప్రకారం,తాహతు బట్టి వాళ్ళు చేసుకొవచ్చును.ఆ హక్కు,స్వేచ్చ వారికి ఉన్నాయి.
కాని ఒక్క సంగతి.గరికపాటి అవధాని గారు చెప్పినట్లు కొవ్వొత్తులు వెలిగించి ,ఉఫ్ మని ఆర్పేయడం మంచిదికాదు.అశుభం.దాని బదులు జ్యోతి ( లు ) వెలిగించి ఆర్పకుండా ఉంచడం సంప్రదాయకంగ,శుభకరంగా ఉంటుంది.మిగతా కార్యక్రమాలన్నీ,వారి ఇష్టప్రకారం. జరుపుకోవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి