ఈ మధ్య రియోడీజనీరో నగరంలో జరిగిన జీ-20 దేశాల శిఖరసమావేశం పెద్దగా ఏమీ సాధించకుండానే ముగిసింది.అందుకు కారణం అభివృద్ధి చెందిన అమెరికా,బ్రిటన్ ,వంటి అగ్రరాజ్యాలు ఆసక్తి చూపక పోవడమే.స్థూలంగా చెప్పాలంటే ; ఆ రాజ్యాలు బాగా పారిశ్రామికీకరణం చేసుకొని,తమ బలం ,సంపదల వలన ప్రపంచంలో వనరులను వశపరచుకొన్నాయి.వాతావరణ కాలుష్యం,ఉద్గారాలు (toxic emissions ) ఆదేశాలే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.అవి తగ్గించుకోవడం వాటికి ఇష్టం లేదు.కాని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను మాత్రం మీరు పరిశ్రమల కాలుష్యం,ఉద్గారాల్ని బాగా తగ్గించుకోమని సలహా ఇస్తాయి.అప్పటికీ మన ప్రధానమంత్రి గత దశాబ్దంలో ఈ దశగా తీసుకొన్న చర్యలను వివరించారు.మనము,చైనా, ఎక్కువగా తినడం వలన ఆహారపదార్థాల కొరత,వాటి ధరల పెరుగుదల కలుగుతున్నాయంటారు. అలాగే మన పరిశ్రమల పెరుగుదల వలన ప్రపంచం వేడెక్కుతున్నదని ,కాలుష్యం పెరుగుతున్నదని వారి వాదన.కాని వాళ్ళ ప్రధాన బాధ్యత,భాగం పట్టించుకోరు.ఈ కారణాల వలన ఆ సమావేశం సఫలం కాలేదు.
26, జూన్ 2012, మంగళవారం
Rio-20 conference.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి