Niraval=singing one or two lines repeatedly but with melodic improvisations to outline the raagaa and its theme.
Taanam=cosists of expanding the raagaa with syllables like ' tha,na,nom.ra etc.
Tani aavartanam = is the extended solo play by the percussionists .
శుద్ధ శాస్త్రీయ సంగీత కచేరిని విని అర్థంచేసుకొని జీర్ణించుకోవాలంటే చాలా మందికి సాధ్యం కాదు.కాని దానిని ఆధారంగా చేసుకొని రచించిన ,సంగీతం సమకూర్చిన పాటలను చాలా మంది విని ఆనందించగలరు.నాటకాల్లో పాటలు,పద్యాలు,లలితసంగీతం.భజనలు,సినిమాపాటలు,స్త్త్రీలపాటలవంటి అన్నిరకాలసంగీతం పైన శాస్త్రీయసంగీతప్రభావంవుంది.ముఖ్యంగా 1940-1970 మధ్య వచ్చిన ఫిల్మ్ సంగీతం వినండి,( తెలుగు,హిందీ).తెలుగులో రాజేశ్వరరావు,పెండ్యాల,ఆదినారాయణరావు .టి.వి.రాజు ,మహదేవన్ వంటి ప్రసిద్ధసంగీతదర్శకులు ఎన్నో పాటలను శాస్త్రీయ రాగాలను అనుసరంచి వరుసలు సమకూర్చారు.రాజేశ్వరరావు గారికి మోహన,భీంపలాస్,రాగాలంటే ఇష్టమట.ఘంటసాలగారికి మోహన,కళ్యాణి రాగాలంటే ఇష్టమట.'మల్లీశ్వరి 'సినిమాలో ' పిలచిన బిగువటరా ' పాట కాపీ రాగంలోను,'ఎందుకే నీకింత తొందరా ' అనే పాట కమాచ్ రాగంలో ఉంటాయి.ప్రసిద్ధిపొందిన ' నీలి మేఘాలలో ' పాట (బావామరదళ్ళు ')భీంపలాస్ రాగంలో ఉన్నది.ఘంటసాల,భానుమతి, కొన్ని కృతులు ,యథాతథంగానే సినిమాల్లో పాడేరు. (ఉదా; వాతాపిగణపతిం భజే,నగుమోము గనలేని ). కొన్ని పాటలను రెండురాగాలు కలిపి జనరంజకం గా కంపోజ్ చేసారు.(ఉదా; జయభేరి సినిమాలో ప్రసిద్ధమైన పాట 'రసికరాజ తగువారముకామా ' చక్రవాకం,మలయమారుతం రాగాలు మేళవించి స్వరపరచినట్లు పాత్ర చేతనే పెండ్యాలవారు చెప్పించారు.)1980 తర్వాత క్రమంగా సినిమాలపై క్లాసికల్ మ్యూజిక్ ప్రభావం తగ్గిపోయి,పాశ్చాత్య,'పాప్' మ్యూజిక్ ప్రబావం హెచ్చయింది.పాత గాయనీగాయకుల్లో చాలామందికి శాస్త్రీయ సంగీతంలో పరిజ్ఞానం ఉండేది.ఘంటసాల,పి.బి.శ్రీనివాస్ ,భానుమతి,లీల,సుశీల ,నాగయ్య ,రఘురామయ్య సూర్యకుమారి,బాలసరస్వతి మొ;వారిని చెప్పుకోవచ్చును.
అలాగే హిందీ సినిమారంగంలో, సైగల్, అనిల్ బిస్వాస్, మన్నాడే,నౌషాద్,రామచంద్ర, శంకర్-జైకిషన్,లతా, ఆశా సిస్టర్స్,రఫీ,మదన్మోహన్ లవంటివారిని చెప్పుకోవచ్చును.
శాస్త్రీయ సంగీతం ఆధునిక కాలంలో కూడా తన వైభవాన్ని కోల్పోకుండా వర్ధిల్లాలని ఆశిద్దాము.
అందుకోసమే యువకళకారులు ,సీ.డీ లద్వారా,ఫ్యూజన్ మ్యూజిక్ ద్వారా ,లఘు కచేరీలద్వారా ప్రయత్నిస్తున్నారు.
(సమాప్తం)
-------