central cabinet నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ విభజన దాదాపు ఖాయమైనది కాబట్టి అనవసరమైన ఆందోళనలతో కాలం,శక్తి,వృథాచెయ్యకుండా అభివృద్ధి మీద కేంద్రీకరించడం మంచిది.అంతేకాదు; కృష్ణా,గుంటూరు వారు తమ అహంకారాన్ని,స్వార్థ బుద్ధిని విడిచిపెట్టి,రాష్ట్ర రాజధానిని రాయలసీమప్రాంతంలో ,కర్నూలులోగాని,ఒంగోలుప్రాంతంలో గాని చండీఘడ్ లాగ చక్కగా తీర్చి నిర్మించడానికి అంగీకరించడం మంచిది.లేకపోతే మళ్ళీ రాయలసీమలో అసంతృప్తి కలుగుతుంది. అలాగే, విశాఖపట్నం ని పారిశ్రామీక,I.T.HUB గా అభివృద్ధిచేయవలసిఉంటుంది.
2 కామెంట్‌లు:
"కృష్ణా,గుంటూరు వారు తమ అహంకారాన్ని,స్వార్థ బుద్ధిని విడిచిపెట్టి,రాష్ట్ర రాజధానిని రాయలసీమప్రాంతంలో ,కర్నూలులోగాని,ఒంగోలుప్రాంతంలో " - they will be fools 3rd time also
విభజన తప్పదని తెలిసింది కనుక, మూడు రాష్ట్రాలు చేయాలని అంటాను, నేనైతే.
రాయలసీమ వారు ఆంధ్రతో కలిసి ఉండాలనుకోవడం లేదు. ఏదో రకంగా వారిని ఒప్పించి కలిసి ఉందామనుకున్నా, తె.వేర్పాటు ఉద్యమంలా మరో ఉద్యమం మొదలవడం ఖాయం.
వైజాగ్ ని రాజధాని చేస్తే, రాయలసీమలో,
కర్నూల్ /ఒంగోలుని రాజధాని చేస్తే, ఉత్తరాంధ్రలో,
విజయవాడ-గుంటూరుని రాజధాని చేస్తే, రెండిటిలో..
ఆ చేసేదేదో, ఇప్పుడే విడగొట్టేస్తే, కనీసం రాయలసీమ - ఆంధ్ర మధ్యనైనా స్నేహ సంబంధాలు ఉంటాయి. నాన్చుడు/వేచిచూసే ధోరణిలో ఉంటే మాత్రం తెలంగాణ వేర్పాటు అనుభవమే మళ్ళీ రిపీటవుతుంది.
వైజాగు- అనకాపల్లి మధ్య లేదా వైజాగ్-తూ.గో.జి మధ్యనున్న ప్రాంతం రాజధానిగా, సర్కారు ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా,
కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలూ, ప్రకాశం జిల్లాలోని కందుకూరు,కనిగిరి, పొదిలి, దర్శి,మార్కాపూరు, కంభం, గిద్దలూరు తాలూకాలతో రాయలసీమ రాష్ట్రాన్నీ ఏర్పరచాలి.
రెండు రాష్ట్రాలకీ రెండు కొత్త రాజధానులు ఏర్పరచాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి