మన భారతీయశాస్త్రీయసంగీతం చాలాకాలం దేశమంతా ఒకే రీతిలో ఉండేది.12వశతాబ్దం నుంచి ముస్లిం దందయాత్రలు ,ఆక్రమణలతో ఉత్తర హిందూస్థానంలో పర్షియన్ సంగీతప్రభావంవలన ఉత్తరాది,దక్షిణాది సంగీతాలు విభిన్న మార్గాలు అనుసరించాయి. దక్షిణాది లేక కర్ణాటక సంగీతంపై పర్షియన్ ప్రభావం చాలా తక్కువ.ఇది నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా,ఆంధ్ర.తమిళ,కేరళ,కన్నడ ప్రాంతాల్లో వ్యాపించింది.విజయనగర సామ్రాజ్యకాలం నుంచి మొత్తం దక్షిణ భారతాన్ని తెలుగు రాజులు,ప్రభువులు ,జమీందారులు పాలించడం వలన తెలుగువారేకాక ఇతర భాషల వాగ్గేయకారులు కూడా తమరచనలని చాలా తెలుగులోనే చేసారు.
మనసంగీతంలో పాశ్చాత్య సంగీతం తోపోలిస్తే haarmony (అనేకవాయిద్యల సమ్మేళనం ) కన్నా melody (రాగం ,స్వరప్రస్తారం )ముఖ్యం.అలాగే prescribed notations కన్నా,మనోధర్మం(improvisation) ముఖ్యం.
సంగీతం సప్తస్వరాల సమ్మేళనం వలన ఏర్పడుతుంది.అవి,1స (షడ్జమ) 2. రి (వృషభ) 3.గ(గాంధార) 4.మ(మధ్యమ) 5.ప (పంచమ) 6.ద (దైవత) 7, ని (నిషాద)
2.శ్రుతి -(musicall pitch ) స్తాయి.ఇది తప్పిపోకుండా maintainn చేయాలి.దీనికి తంబురా వాడుతారు.
3.తాళం (fixed time cycle ) లయ.
4.రాగం మొత్తం 72 మేళకర్త రాగాలు ఉన్నాయి.(జనకరాగాలు).వీట్లోంచి ఎన్నో జన్య రాగాలు సాధించవచ్చును.పాటల్లో వైవిధ్యం ఈ వివిధ రాగాలవలననే కలుగుతుంది.(tunes)
సంగీతం నేర్చుకొనడానికి ప్రాథమిక మైన దశ నుంచి ప్రారంభించి క్రమంగా ఉన్నతమైన ,క్లిష్టమైన దశకు చెరుకోవలసి ఉంటుంది.అందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందంటారు.
మొదట సరిగమలు సరిగ పలకడం నేర్పుతారు. తర్వాత వాటినే జంటగా.సస,రిరి,గగ-,అని సాధనచేయిస్తారు.తర్వాత సరళీస్వరాలు ,గీతాలు నేర్పిస్తారు.
వర్ణం;-ఇందులో రాగానికి కావలసిన పల్లవి,అనుపల్లవి,చరణం, చిట్టస్వరం(పదాలుల్లేకుండా స్వరాలు మాత్రమే) ఉంటాయి.ఇవి బాగా నేర్చుకుంటే ,శ్రుతి,తాళం,voice culture అలవడుతాయి.
కృతి(కీర్తన) ;-ఇంకా పై మెట్టు అన్నమాట.వీటిలో,పల్లవి,అనుపల్లవి,చరణాలు ఉంటాయి.పాడినప్పుడు రాగాలాపన,తానం,సంగతులు,గమకాలు వేసి పాడతారు.
ఇవి గాక నృత్యానికి అనుకూలమైన జావళీలు,తిల్లానలు.భజనపాటలు మొదలైనవి కూడా ఉంటాయి.
ఈ బ్లాగులు సీరియల్గా వ్రాయదలుచుకొన్నాను.సంగీతంలో ప్రవేశం ఉన్నవారికి ఇవి అనవసరము. అలాగే అభిరుచి లేనివారికి కూడా అనవసరమే.నాలాగ అభిరుచి ఉన్నా ప్రవేశంలేనివారికోసమే.,నా పరిమితజ్ఞానం తో వ్రాస్తున్నాను.
((ఇంకా ఉంది)).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి