7, నవంబర్ 2013, గురువారం

Sastreeyasangeetam-2;composers



 

 కర్నాటక సంగీతంలో  గాత్రానికి సహకారంగానూ,స్వతంత్రంగానూ కొన్నివాద్యాలని వాడ్తారు.1.తంత్రీ వాద్యాలు.వయొలిన్, వీణ వంటివి.(stringed instruments)2.సుషిర   వాయిద్యాలు;వేణువు,సన్నాయి వంటివి ( wind instruments ) 3.అనవద్ధ వాద్యాలు.(percussion instruments) మృదంగం  ,డోలు వంటివి.ఈ రోజుల్లో క్లారినెట్.మాండొలిన్,శాక్జొఫోన్ వంటివి కూడా వాడుతున్నారు.
  వాగ్గేయకారులు (composers) ;-- 1.పురందరదాస(1484-1564) కన్నడంలోను,సంస్కృతంలోను ఎన్నోవేల కీర్తనలు రచిస్తే ఇప్పుడు లభ్యమౌతున్నవి 2000.
   2.కనకదాస;-- (1509-1609 )కన్నడంలో 1000 కీర్తనలు
  3.అన్నమాచార్య ;-- 30000దాకా రచించినట్లు ప్రతీతి.కాని నేడు 3600 కీర్తనలు మాత్రం లభ్యం.తెలుగులోను,కొన్ని సంస్కృతంలోను రచించాడు .
  4.అరుణగిరినాథ;--  తమిళంలో దాదాపు  1500 రచనలు చేసాడు.(15 వశతాబ్దం.)
 5.భద్రాచల రామదాసు ;-- (1620-1688) తెలుగులో500 కీర్తనలు రచించాడు.దాశరథి  శతకకర్త కూడా.
  6.క్షేత్రయ్య;-- (1600-1680)తెలుగులో100 పదాలు రచించాడు
   7.నారాయణతీర్థ;- (1650-1745) తెలుగు,సంస్కృతంలో 200 రచనలు
  8.సారంగపాణి;--  (1680-1750) తెలుగులో 200 పైగా పదాలు రచించాడు
  9.విజయదాస- (1682-1755 ) కన్నడంలో 25000  కీర్తనలు రాసినట్లు ప్రతీతి.
  ఇక సంగీతానికి త్రిమూర్తులుగా పేరుపడిన వారు18 వ  శతాబ్దపు మలిభాగంలోను,19వ  శతాబ్దం తొలిభాగంలోను  జీవించారు.సమకాలికులు.తంజావూరు ప్రాంతీయులు.
  1.త్యాగరాజు;- సుప్రసిద్ధులు. వేలకొద్దీ కృతులు పాడినా  ప్రస్తుతం దాదాపు 1000 కీర్తనలే దొరుకుతున్నవి.జీవితకాలం 1767-1845 ప్రహ్లాదవిజయం.నౌకాచరిత్రం అనే సంగీత నాటికలు కూడా రచించాడు.
  2.శ్యామశాస్త్రి;-మీనాక్షీదేవి పైన ఎక్కువ కృతులు రచించాడు.(1762 -1827)
  3.ముత్తుస్వామి దీక్షితులు ;- (1776-1835) 300 కృతులు రచించాడు.సంస్కృతంలో వ్రాసిన ఈ కీర్తనలలో ఒక చోట రాగం పేరును సూచించడం ఈయన ప్రత్యేకత.
  వీరుగాక,తిరువాంకూర్ ప్రభువు స్వాతితిరునాళ్ (1813-1843 ) బహుభాషావేత్త .చాలా భాషల్లో స్వల్ప   జీవితకాలంలోనే రచించాడు.
  సదాశివబ్రహ్మం,మైసూర్ వాసుదేవాచార్ ,పట్నం సుబ్రమణ్య అయ్యర్, చెప్పుకోదగిన  వాగ్గేయకారులు.
  ఆధునికులు కూడా కొందరు ( బాలమురళీకృష్ణ   వంటివారు ) సంగీతరచనలు కొనసాగిస్తూనేఉన్నారు.చాలామంది వాగ్గేయకారులు తమపేరును ఒకచోట ఉటంకిస్తారు. (ఉదా;'త్యాగరాజనుత 'అన్నట్లు).   

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మీరు రాస్తున్న ఈ టపాలు మా లాటి సంగీతమంటే తెలియనివారికి కొంత పరిజ్ఞానం కలుగుతోంది. కొన సాగించండి.