16, నవంబర్ 2013, శనివారం




 సచిన్ టెండుల్కర్ కి,డా;C.N.రావుకి భారతప్రభుత్వం  ' భారతరత్న 'ప్రదానం చెయ్యడం మనకందరికీ అమితానందదాయక మైన విషయం.సచిన్ గురించి అందరికీ తెలుసును.కాని శాస్త్రజ్ఞులు ఎంత గొప్పవారైనా  క్రీడాకారుల వలె,సినిమా వారివలె సామాన్యప్రజలకు తెలియదు.డా;రావుగారు రసాయనికశాస్త్రంలో నిష్ణాతుడు.అంగారకగ్రహయాన రాకెట్ విజయంలో కూడా ప్రముఖపాత్ర వహించారని తెలిసింది.వీరిద్దర్కీ హార్దికాభినందనలు  తెలుపుదాము.కాని ఒక్క విషయం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి భారతరత్న వస్తుందనీఅశించాను.సంగీతరంగంలో ఆయన అగ్రగామికదా.వచ్చేసంవత్సరంలోనైనా  ఆయనకు ఆ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను.ఇప్పటివరకు  పండిట్ రవిశంకర్ కి,పండిట్ భీంసేన్ జోషి కి ,ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ కి ఇచ్చారు.కర్ణాటకసంగీతంలో దక్షిణాది నుంచి ఒక్క సుబ్బులక్ష్మిగారికే ఈ గౌరవం దక్కింది.అందువలన వచ్చే ఏడాది బాలమురళీకృష్ణ గారికి 'భారతరత్న 'పురస్కారం తప్పక లభించాలని   కోరుకొందాము.అలాగే ISRO DIRECTOR రాధాకృష్ణన్ కికూడా(మంగళ్యాన్ ప్రాజెక్టుకు నిర్దేశకులు)  'భారతరత్న 'బహూకరిస్తారని ఆశిద్దాము. 

కామెంట్‌లు లేవు: