ఆరుద్ర శుద్ధమధ్యాక్కరలు.;-ఆరుద్ర వ్యంగ్యానికి,హాస్యానికి,కొత్తప్రయోగాలకీ పెట్టిందిపేరు.విశ్వనాథవారికి 'మధ్యాక్కరలకి సాహిత్య అకాడమీ బహుమతి వచినప్పుడు ఆరుద్ర తన మధ్యాక్కరలనివ్రాసి ఆయనకే అంకితం ఇచ్చారు.ఆరుద్ర అభిప్రాయంప్రకారం పాడుకోడానికి పుట్టిన 'అక్కరలనీ జటిలమైన చందోవ్యాకరణాలతో పండితకవులు పద్యాలుగా మార్చేసారని.అందువలన సరళంగా తన శుద్ధ మధ్యాక్కరలు రచించారు.వాటి చందసుని తానే ఇలా నిర్వచించారు.'' పదమూడు మాత్రలున్నట్టి పాదార్థముల వళ్ళుపెట్టి ,తుదిప్రాసలందు నిలుపు,తూకాన అవి రెండు కలుపు.మొదలట్లు తొలిప్రాసవుంచి ముద్దుగా నాల్గాలపించు. '' ఉదాహరణకు మూడు రాస్తున్నాను.
'' ఆంధ్రలో రోడ్లన్న భయము--ఆఫ్రికా అడవులే నయము.
చాంద్రాయణము చేయు జనులు --- జపము విడిచిన మేటి మునులు
గంద్రగోళపు ఆటవిడుపు ---సంద్రపు ఘోష దిగదుడుపు
ఇంద్రుడైనా గుడ్డివాడు,--ఇచ్చోట తానడువలేడు.''
'' గేయమేముందుపుట్టింది --హాయిగా జాతి నవ్వింది.
వేయిపేరుల లక్షణమ్ము --వెనుకవచ్చిన దుప్పికొమ్ము.
తీయతీయని నాటుపాట --దేశీయసంపదల మూట
హేయమైనది పండితులకు --ఇల సంస్కృతపు హెచ్చుకొరకు. ''''
'' తనకు లేదని బాధకాదు-- తనవారికలిమిచేదు
తనివి తీరడమనుటలేదు --తనలోని చెడు దుగ్ధ పోదు.
కనబడని రోగమే ఈసు--- కాలకూటపు కంచు గ్లాసు
మునిగిపోయే పిచ్చివాడు--ముందు తీరము చేర లేడు
1 కామెంట్:
మంచి పరిచయం.ఇంకా వివరంగా వ్రాయాల్సింది.ఇంత చక్కటి ఛందస్సుని వదలి పెట్టి మన ఛాందస పండిత కవులు సంస్కృత దురభిమానంతో తెలుగుకి తీరని ద్రోహం చేసారు.ఇంకా వివరించడానికి ఇది వేదిక కాదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి