ఒకప్పుడు బోగంవారని,తర్వాత కళావంతులని పేరున్నవారి కులవృత్తి గురించి ఇక్కడవ్రాయడంలేదు.వారిలో చాలామంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు.ఈ రోజుల్లో అనేక కారణాలవలన ఇతర కులాలలోకి కూడా ఈ పడుపు వృత్తి వ్యాపించింది.నేను వ్రాయదలుచుకొన్నది;వారు సంప్రదాయకళలకి,ఆధునిక కళలకీ.చేసిన సేవ ,contribution గురించి మాత్రమే.రాజసభల్లో నర్తకులుగా,దేవాలయాల్లో దేవదాసీ నర్తకులుగా నృత్యకళను బాగా నేర్చుకొని ప్రదర్శించేవారు.మేజువాణీల్లోను,కొన్ని పెళ్ళిళ్ళలోను కూడా నాట్య ప్రదర్శనలిచ్చేవారు.శాస్త్రం తెలిసిన పండితులు వీరికి నేర్పేవారు.ఒక్క మన రాష్ట్రం లోనేకాదు ,ఒడిస్సా,తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే సంప్రదాయసంగీతం,నృత్యం ,పోషించారు.ఉత్తరాదిలో కూడా,నవాబులు,మహారాజాల ప్రాపకంలో హిందూస్తానీ సంగీతాన్ని,నృత్యాల్ని అభ్యసించి ప్రదర్శించేవారు.వీరిలో కొందరు కవయిత్రులూ,విదుషీ మణులూ కూడా ఉండేవారు,వీరిలో ధనవంతులైనవారు కొందరు గుళ్ళు తటాకాల నిర్మాణానికి ,గోపురాలకి,సత్రాలకి దానధర్మాలు చేసిన శాసనాలు ఉన్నాయి.
ఇక ఆధునిక కాలంలో చూస్తే,మొదట్లో సంసారస్త్రీలు ముందుకురాని రోజుల్లో నాటకాలు, సినిమాలలో,ప్రధానపాత్రలు ధరించి జనరంజకంగా ప్రసిద్ధి పొందిన వారు.జానపదకళాకారులవలె మన కళల్ని ఆచరించి,వృద్ధి పొందించడంలో వీరి ముఖ్య పాత్రకు అభినందనలు, కృతజ్ఞతను తెలుపవలసి వున్నది.
1 కామెంట్:
వారు వృత్యరీత్యా ఎలా ఉన్నా ఇతరులకు దూరంగా ఉంటూ, తమదైన ప్రిదిలో కొంత మేలు చేసినవారులేకపోలేదు. కులవృత్తులూ,సామాజిక కట్టుబాట్లూ మాసిపోయి అన్నీ కలగాపులగంగా తలకిందులైన మనస్తత్వాన్ని చూపెడుతున్నది ఇప్పటి సమాజం. మీ పోస్ట్ బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి