కథాపార్వతీపురం;;
--------------ప్రచురణ;స్నేహకళాసాహితి,పార్వతీపురం-2012;వెల ;రూ 250
వందేళ్ళ కథా సంపుటాలు,ప్రాంతీయ కథాసంపుటాలు చూసాము.ఒకరచయిత తన స్వంతవూరిగురించి రచించిన కథాసంపుటాలు కూడా చూసాము.(ఉదా; పసలపూడికథలు,దాక్షారామకథలు ) కాని ఈ కథాసంపుటి ఒకే వూరినించి వచ్చిన పెక్కు కథకులు రచించినది.మొత్తం 52 కథలలో నలుగురు రచయిత్రులు మాత్రమున్నారు.6 గురు కీర్తిశేషులున్నారు.విజయనగరం జిల్లాలో చిన్నపట్టణమైన పార్వతీపురం నుంచి ఇంతమంది కథరచయితలు రావడం విశేషమే.తెలుగులో తొలి కథారచయితగాపేర్కొనబడే కీ .శే.ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ గారి నుంచి(1903) వర్ధమానరచయిత్రి బెలగాం గాయత్రి వరకు ఇందులో సమకూరడం మరొక విశేషం.లబ్ధప్రతిష్ఠులైన కీ.శే.యస్.వి.జోగారావు,పంతులవిశ్వనాథరావు, భూషణం,లతోబాటు వర్తమాన ప్రసిద్ధులైన శ్రీ యుతులు వి.వి.బి.రామారావు,వంగపండు ప్రసాదరావు,పంతులజోగారావు,చింతా అప్పలనాయుడు,బి.వి.ఏ.రామారావునయుడు,వాడ్రేవు చినవీరభద్రుడు ,గొల్లపూడిమారుతీరావు,అరుణపప్పు,ఏ.ఎన్.జగన్నాథశర్మ,గణేశ్ పాత్రో, అట్టాడ అప్పలనాయుడు,గంటేడ గౌరునాయుడు ,వంటి ప్రముఖకథారచయితలతో బాటు ఇతర మంచి కథకుల రచనలు ఇందులో చాలా చేర్చబడ్డాయి.
పార్వతీపురం మన్యం (agency) కి ముఖద్వారం.అడవుల్లో దొరికే వస్తువులు (products) వ్యాపారం జరుగుతూఉంటుంది.1970 నాటి శ్రీకాకుళం నక్సలైటు ఉద్యమనేపథ్యంలో గిరిజనుల,రైతుకూలీల పోరాటాల విశేషాలతో చాలాకథలువున్నాయి.సంప్రదాయ కులవృత్తుల విధ్వంసం. భూమితగాదాలు, ప్రపంచీకరణ దుష్ఫలితాలు, alienation (పరాయీకరణ) ,ప్రధానంగా కథావస్తువులు.వీటితోబాటు మధ్యతరగతికుటుంబాల విచ్చిన్నం,ఇబ్బందులు ,కష్టాలు కూడా కొన్ని కథల ఇతివృత్తంగా తీసుకోబడ్డాయి.
చాలాకథలు ఉత్తరాంధ్ర పల్లెటూర్ల యాసతో చాలా వాస్తవికంగా ఉన్నాయి.ఎక్కడా కృత్రిమత్వం కనబడదు.ప్రాంతీయ సుగంధం( local flavour) బాగాపరిమళించింది.ఉత్తరాంధ్రులేకాకుండా అందరూ చదవవలసిన పుస్తకం.
ఈ కథాసంకలనకర్తలు ఏ.అప్పలనాయుడు, జి.గౌరునాయుడు గార్లకి అభినందనలు.
చాలా ప్రాంతీయ పల్లెటూరి యాస పదాలు ఇతర ప్రాంతీయులకు అర్థం కావు,చివరిలో పదాలకి అర్థాలు glossary వంటిది ఇచ్చివుంటే బాగుండేది.
2 కామెంట్‌లు:
Very interesting...thanks for introducing valuable book.
మా వూరి కథల సంపుటి పరిచయం బాగుంది సార్. ధన్యవాదాలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి