ఈ రోజు (25-8-13)ABN OPEN HEART WITH RKకార్యక్రమంలో రావు బాలసరస్వతీదేవి తో ఇంటర్వ్యూ గురించి నాలుగు మాటలు;మా చిన్నతనంలో, ఆవిడ పాడిన సోలో 'ఆతోటలో నొకటి ఆరాధనాలయము ' ,వంటి పాటలు,సాలూరు రాజేశ్వరరావు తో పాడిన 'తుమ్మెదా ఒకసారి ' వంటి డ్యూయట్లు చాలా పాపులర్ గా ఉండేవి.అవి ప్రైవేటు గ్రామొఫోన్ రికార్డులు.సినిమాల్లో కూడా పాపులర్ పాటలు చాలాపాడారు.జమీందార్ కుటుంబంలో వివాహమయ్యాక తగ్గించవలసివచ్చినా 50,60,ల దాకా కొన్ని మంచి పాటల్ని తెలుగు,తమిళ సినిమాల్లో పాడారు.15 సం;క్రితం మద్రాసు వెళుతున్నప్పుడు మాతో రైల్లో కలిసి ప్రయాణం చేస్తూ చాలా కబుర్లు చెప్పారు.మా వాళ్ళ కోరికమీద మెల్లగా కొన్ని పాటలు కూడా పాడారు.ఈరోజు ఇంటర్వ్యూలో రెండు విషయాలు తప్ప అంతా నిజాయతీగానే చెప్పారు.బహుశా ,unpleasant truths అని వదిలివేసిఉండొచ్చును.బాలసరస్వతి కంఠం మధురంగా ఉంటుంది.కాని తారాస్థాయి (high pitch )లో ఇబ్బంది అవుతుంది.ఆశ్చర్యమేమంటే ,ఆవిడకన్నా బాగా జూనియర్స్ ఐన సుశీల,జానకి ఇప్పుడు వణుకు వలన బాగా పాడలేకపోతుంటే ఈవిడ గొంతుకలో మాత్రం పెద్దమార్పేమీ లేక బాగా పాడ గలగడం.ఇక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,సినిమా పరిశ్రమ ఆమె పై చూపించిన నిర్లక్ష్యం గురించి ఆవిడ నోటంటే విన్నారు కాబట్టి మళ్ళీ రాయనవసరం లేదనుకుంటాను.
25, ఆగస్టు 2013, ఆదివారం
balasaraswati,singer

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి