4--7--13:- 4th of July , American Independence Day: ఇవేళ అమెరికా స్వాతంత్ర్య దినం. హడ్సన్ (Hudson) నదిలో నౌకలని నిలబెట్టి వాటినుంచి బాణాసంచా కాలుస్తారు. సాయంకాలం నుంచి ట్రాఫిక్ నిబంధన, పోలీసు పహరా ప్రారంభమైనది. కొందరు కార్లలో ఇతర ప్రాంతాలనుంచి వచ్చి వీక్షించారు. కొందరు పడవలు, క్రూయిజ్ల (cruise) నుంచి వీక్షించారు. మేము మాత్రం మా ఇంట్లోనుంచే చూడగలిగాము. రాత్రి9-30 నుంచి 10 గంటలదాకా ఆ కార్యక్రమం కొనసాగింది. ఎంతో గొప్పగా, మనోజ్ఞంగా సాగింది. నవరత్నాలు రాశులుగా ఆకాశం లోంచి రాలుతున్నట్లు అనిపించింది. జాతీయ కార్యక్రమం కాబట్టి ప్రభుత్వశాఖ నిర్వహిస్తుంది అనుకొన్నాము. కాని, అమెరికా కదా, దీన్ని కూడా ఒక ప్రైవేటు కంపెనీ కి అప్పజెప్పారు. మొత్తం మీద జులై నాలుగు ఉల్లాసంగా గడిచింది.
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి