16-7-13;-ఈ అపార్ట్ మెంట్ నేలమాళిగ (cellar) అంతా ఒక జిం (gymnasium) దాదాపు 40 వేల చ.అ. వ్యాపించి ఉంది.అందులో ఎన్నో వ్యాయామ సాధనాలు ఉన్నాయి. బిల్డింగు మొత్తంలో ఉన్నవారు, అతిథులు ఇక్కడ వ్యాయామం చేసుకోవచ్చును. ఆడ, మొగ, పిన్న, పెద్ద, 30, 40, మంది ఎప్పుడూ కొంత exercise చేసుకొని వెళ్తుంటారు.ఇందులో ఒక ఈత కొలను swimming pool కూడా వుంది. అందులోనే మా మనమడు ఈత నేర్చుకొన్నాడు. టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ కూడా ఉన్నాయి. ఐతే వీటికి డబ్బు కట్టి సభ్యత్వం తీసుకోవలసిఉంటుంది.
17-7-13 ;ఈ రోజు రాత్రి ఎంపైర్ స్టేట్ బిల్డింగు (empire state building) పైకి ఎక్కడానికి నిశ్చయించుకున్నాము. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 2 గంట్ల వరకు వేలాది సందర్శకులు ఇందు కోసం వస్తుంటారు. పగలు రద్దీ ఎక్కువని, పైగా మా ఇంటికి దగ్గరే కావడం వలన రాత్రి 10 గంటలకి భోజనం చేసి taxi లో బయలు దేరాము. అప్పటికీ ఇంకా జనం బాగానే ఉన్నారు. వేసవి కాలం కావడం వలన New York కి సందర్శకులు (tourists) విపరీతంగా వస్తారు. మమ్మల్ని చూడగానే భారతీయులు గా మమ్మల్ని గుర్తించి, నమస్తే అంటూ స్వాగతం పలికారు. It was a pleasant surprise. సందర్శకులను అంతగా ఆకర్షిస్తారు ఇక్కడ!
కింది అంతస్తులో అర కిలోమీటరు దూరం ' క్యూ 'లో నడిచాక సెక్యూరిటీ చెక్ రెండుసార్లు చేసాక లిఫ్ట్ లో వేగంగా 80 వ అంతస్తు చేరాము. అక్కడ నుంచి మరొక లిఫ్ట్ లో 86 వ అంతస్తులోకి తీసుకు వెళ్ళారు. అక్కడ చుట్టూ విశాలమైన బాల్కనీ ఉంది. మబ్బులు, వాన, పొగమంచు లేక ఆకాశం నిర్మలంగాఉంది. వేసవి కాలం కాబట్టి చలిగా లేదు. ఈ బిల్డింగుని 1931 లో కట్టారు. దీనిలో 102 అంతస్తులు ఉన్నవి. మొత్తం ఎత్తు 1250 అడుగులు. చాలాకాలం ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైందిగా పేరొందినది. ఈ మధ్య కాలంలో దీని కన్నా ఎత్తయినవి కట్టబడ్డా, దీని ప్రత్యేకత ఇంకా తగ్గలేదు. చుట్టూ 80 మైళ్ళదాకా ఉన్న దేశం కనిపిస్తుంది. రాత్రి కాబట్టి మేడలన్నీ దీపాలతో ధగధగాయమానంగా వెలుగుతున్నవి.
సందర్శనం ముగించుకొని ఇంటికి చేరుకొనేసరికి రాత్రి ఒంటిగంట దాటింది.
ఈ ఆకాశహర్మ్యం మా అపార్ట్ మెంట్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. రాత్రిపూట, ఒక్కో రోజు ఒక్కొక రకంగా దీపాలంకరణ చేస్తూ ఉంటారు. ఇందులో అంతర్జాతీయ కంపెనీలు, ఆఫీసులు చాలా ఉన్నాయి. న్యూయార్కు వచ్చినవాళ్ళు ఎవరూ సామాన్యంగా దీనిని చూడకుండా వెళ్ళరు. ఏడాదికి 20,30 లక్షలమంది వస్తారట. సందర్శనానికి (పైకెక్కి చూడడానికి) టికెట్ ఖరీదు కాస్త ఎక్కువే. అంటే 25 డాలర్లు మాత్రమే. రూపాయిల్లో లెక్క పెట్టకండి!

- ఉత్తరదిక్కునుంచి హడ్సన్ (Hudson) నది, నౌకలు, వాషింగ్టన్ వంతెన, న్యూజెర్సీ, ఆకుపచ్చటి మెట్ లైఫ్ (MetLife) కట్టడము, జనరల్ ఎలక్ట్రిక్ (G.E.) కనిపిస్తాయి.
- దక్షిణ దిక్కు నుంచి వూల్ వర్త్ (Woolworth ) బిల్డింగు (60 అంతస్తులది), ఎల్లిస్ (Ellis) ద్వీపము, లిబర్టీ విగ్రహము (Statue of Liberty), కనిపిస్తాయి. ఇంకా financial district (Wall Street) లోని బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజి (Stock Exchange) కనిపిస్తాయి.
- తూర్పు దిక్కు నుంచి ఈస్ట్ రివర్, క్వీన్స్ బరో, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయము (United Nations Building), అందమైన ఆర్చీలతో వెలుగుతున్న క్రైస్లర్ (Chrylser) బిల్డింగు కనిపిస్తాయి. ఇంకా దూరంగా J.F.K. విమానాశ్రయం అస్పష్టంగా కనిపిస్తుంది.
- పడమటి దిక్కు నుంచి మాడిసన్ స్క్వేర్ (Madison square garden-sports arena), జాకబ్ జవిట్స్ (Jacob Javits) కన్వెన్షన్ సెంటర్, ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం (air and space museum ) కనిపిస్తాయి. న్యూజెర్సీ (New Jersey) కూడా కనిపిస్తుంది.
సందర్శనం ముగించుకొని ఇంటికి చేరుకొనేసరికి రాత్రి ఒంటిగంట దాటింది.
ఈ ఆకాశహర్మ్యం మా అపార్ట్ మెంట్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. రాత్రిపూట, ఒక్కో రోజు ఒక్కొక రకంగా దీపాలంకరణ చేస్తూ ఉంటారు. ఇందులో అంతర్జాతీయ కంపెనీలు, ఆఫీసులు చాలా ఉన్నాయి. న్యూయార్కు వచ్చినవాళ్ళు ఎవరూ సామాన్యంగా దీనిని చూడకుండా వెళ్ళరు. ఏడాదికి 20,30 లక్షలమంది వస్తారట. సందర్శనానికి (పైకెక్కి చూడడానికి) టికెట్ ఖరీదు కాస్త ఎక్కువే. అంటే 25 డాలర్లు మాత్రమే. రూపాయిల్లో లెక్క పెట్టకండి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి