ఇంతకు ముందే రాయవలసిందిమరచిపోయి ఇప్పుడు రాస్తున్నాను. ఈ రోజు మెట్రోపాలిటన్ ముసెఉం (మెట్రోపాలిటన్ మ్యూజియం) కి బయలుదేరాము. న్యూయర్కులో ఎన్నో మ్యూజియంస్ ఉన్నాయి. ఒక్కొక్క విషయానికి ఒక మ్యూజియం వేర్వేరు గా ఉన్నాయి. ప్రాణికోటికి Natural history museum, చిత్రకళకి Guggeinheim
museum, ఇలా వేరువేరు గా ఉన్నాయి.
ఈ Metropolitan Museum కళాత్మక వస్తువులు వివిధ దేశాలనుంచి సేకరించి ఉన్నవి. ఇది 5వ అవెన్యూలోఉంది. రోజుకి కొన్ని వేలమంది సందర్శిస్తుంటారు. అసలు బిల్డింగే ఎంతో ఉన్నతంగా గొప్పగా ఆకర్షణీయంగాఉంది. ముఖద్వారం గ్రీకో రోమన్ శైలిలో పెద్దస్తంభాలతో ఉంది. లోపల పెద్దహాలు రినజాన్సు renaissance శైలిలో ఉంది. ప్రాచీన ఈజిప్టు, సుమేరియా, సింధు నాగరకత నుంచి, మధ్యయుగాలు దాటి ,ఆధునిక అమెరికన్ నాగరకత వరకు కళాత్మక వస్తువులు, శిల్పాలు, చిత్రాలు ఎన్నో ఉన్నవి. ఒక్కొక్క విభాగానికి దాని దాత పేరు పెట్టారు. ఈ మ్యూజియం మన సాలార్జంగ్ మ్యూజియం కి రెండురెట్లు పైగా ఉంటుంది. మూడు అంతస్తులలో వందలకొద్ది గదులలో ప్రదర్శించిన పద్ధతి బాగుంది. మధ్యలో అల్పాహారం తీసుకొని ఉదయం 11 గంటల్నుంచి, సాయంత్రం 5 గంటల వరకు తిరిగి చూసాము.నాకు చక్రాల బండి ఏర్పాటు చేసారు. ప్రతీది వివరంగా చూస్తూ పోతే కొన్ని రోజులు పట్టుతుందంటారు.
మనకన్నా ఇక్కడి ప్రజలకి ఇటువంటి ప్రదర్శనలంటే ఎక్కువ ఆసక్తి. శ్రద్ధ చూపిస్తారు. ఇందులో నేను చూసిన విగ్రహాలన్నిటిలోను ఆకర్షించినవి, చాలా పెద్దవి, ఒక్కొక్కటి 20 అడుగుల కన్నా ఎత్తయినవి మూడు:
1.ఈజిప్టు రాజు ఫరో రాంసెస్ విగ్రహం.
2.'మెడుసా ' తల ఖండించి చెతితో పట్టుకున్న గ్రీకువీరుడు 'పెర్సియస్ ' విగ్రహం
3.పాండ్య దేశపు శిల్పము, విష్ణుమూర్తి విగ్రహము.
ఇంతకు ముందు చూడని అస్సీరియన్, ఫొనీషియన్, సైప్రస్, పెర్షియన్ శిల్పాలు ఉన్నాయి. మరొక ముఖ్యమైనవిషయం, ప్రాచీన ఈజిప్టు దేవాలయం ఒకదాన్ని తీసుకువచ్చి ఇక్కడ మళ్ళీ కట్టారు.'హాట్సెప్సట్ ' రాణి ' స్ఫిన్క్ ' విగ్రహం కూడా ఉన్నది. మొత్తం మీద విజ్ఞానాని, వినోదాన్ని పంచిపెట్టే యీ మ్యూజియం ని చూడటం ఒక గొప్ప అనుభవం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి