18,19,20 జులై,2013;--
19వ తా; మధ్యాహ్నం బస్సులో బయలుదేరి రెండు గంటలు ప్రయాణం చేసి 'ఫిలడెల్ఫియా 'చేరుకున్నాము. ఎప్పటిలానే మా పెద్దబ్బాయి నాకు తోడు. ఆవూళ్ళో మా చిన్నన్న కూతురు, మనమడు, అతని భార్య ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. బస్ స్టేషన్ కి వచ్చి లోకల్ ట్రైన్ లో మమ్మల్ని వాళ్ళింటికి తీసుకొని వెళ్లాడు. ఆ ఇల్లు గేటెడ్ కమ్మ్యూనిటీలోఉంది. కొంచెం చిన్నదైనా అన్ని సదుపాయాలు కలిగి ఉంది.ఉదయం 9 గంటలకి మా మనమడు వాసు కారులో అందరం వాషింగ్టన్ బయలుదేరాము. ఫిలడెల్ఫియా కూడ పెద్ద పట్టణమే.అక్కడికి గంటప్రయాణం.మా అమ్మాయి తెలుగు భోజనం తెచ్చింది కాబట్టి లంచ్ కి ఇబ్బంది లేకపోయింది.
న్యూయార్క్ అమెరికాకి ఆర్థిక,వ్యాపారకేంద్రం కాగా ,వాషింగ్టన్ పరిపాలనాకేంద్రం.రాజధాని.న్యూయార్క్ తో పోలిస్తే చిన్న నగరం. కాని,న్యూఢిల్లీ లాగే అందంగా, హుందాగా ఉంది, మీదు మిక్కిలి విశాలంగా. ఊరినిండా విగ్రహాలు, పార్కులు, మ్యూజియంస్, monument s ఉన్నాయి. మేము లింకన్ మెమోరియల్, జెఫ్రెసన్ మెమోరియల్, వాషింగ్టన్ మెమోరియల్ చూసాము. వాషింగ్టన్ మెమోరియల్ దగ్గర ఒక పెద్ద స్తంభం (column/ obelisk) ఉంది. ఊరంతా కనిపిస్తుంది. Smithsonian institutes అని చాలా ప్రదర్శన శాలలు ఉన్నాయి. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ smithsonian institutes ల లోకి ప్రవేశం ఉచితం. కాని సమయాభావంచేత లోపలికి వెళ్ళి చూడలేదు.
తర్వాత తిన్నగా శ్వేత సౌధం అనగా వైట్ హౌస్ (white house) కి వెళ్ళాము. పూర్తిగా తెల్లగా రంగులేవీ లేకుండా ఉండటంచేత దీనిని వైట్ హౌస్ అంటారు. ఇదే అమెరికా అధ్యక్షుడి నివాస స్థానము, మరియూ ఆఫీసు. అంటే ప్రపంచంలోకెల్లా ధనవంతమూ, శక్తివంతమూ అయిన దేశానికి పరిపాలకుని నివాసం. జాతీయ,అంతర్జాతీయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే చోటు. ఇది మూడంతస్తులలో ఉంది. ప్రవేశ ద్వారం గ్రీకు స్తంభాలతో నిర్మించారు. చుట్టూ ఇనప కటకటాలు, గేట్లతో ఉంది. ప్రత్యేక అనుమతి లేనిదే లోనకు వెళ్ళలేము. పైనుంచే చూసాము. కాని ఇంతకు ముందు ప్రత్యేక అనుమతి సంపాదించి చూసామని మా పెద్ద కోడలు విజయ చెప్పింది. చాలా బాగుంటుంది, చూడవలసినవి చాలా ఉన్నాయని చెప్పింది. బ్లూరూం, రెడ్ రూం, గ్రీన్ రూం అని డెకర్ బట్టి పేర్లు పెట్టారు. ఒక చైనా రూం కూడా ఉందట. అందులో అరుదైన పింగాణీ వస్తువులు ఉంటాయి. అతిథులను ఆహ్వానించె గది, సమావేశపు గదులు, భోజనశాలలు, విదేశీప్రతినిధులతో సమావేశమయ్యే గది ఇలా ఉన్నాయట. అధ్యక్షుల కుటుంబం నివసించే భాగానికి మాత్రం ప్రవేశం నిషిద్ధం. ఏమైనా మన రాష్ట్ర పతి భవనం కన్నా బాగా చిన్నది. బకింగ్ హాం ప్యాలెస్ (Buckingham Palace) కన్న, రష్యా లోని క్రెంలిన్ (Kremlin) కన్నా చిన్నదే.
తర్వాత ముఖ్యంగా చూడవలసిన కేపిటల్ హిల్ (capitol hill) కి వెళ్ళాము. ఇందులోనే అమెరికా శాసనసభల సమావేశాలు జరుగుతాయి.(U.S.congress and senate) అనేక సినిమాల్లో పెద్దగుమ్మటం లాగ కనిపించేది ఇదే. మేము ముందే అనుమతి తీసుకొని సెక్యూరిటీ చెక్ తర్వాత లోపలికి వెళ్ళాము. విశాలమైన హాల్స్ దాటి డోం లోకి ప్రవెశించాము. ప్రపంచంలోని అతిపెద్ద డోంస్ (domes) లొ ఇదొకటి అని చెప్పవచ్చును. గోడలు,స్తంభాలు, పైకప్పు మీద అమెరికన్ చరిత్రను,300 సం; సంఘటనలను, ప్రముఖ వ్యక్తులను చిత్రించే శిల్పాలు, చిత్రాలు (paintings) ఉన్నాయి. దీనికి ఆనుకొని కొన్ని సమావేశపు హాల్స్ ఉన్నవి. కింద, ఇంత పెద్ద గుమ్మటాన్ని నిలబెట్టే మూలస్తంభాల గది ఉంది. లింకన్, రీగన్, రెడ్ ఇండియన్ చీఫ్ విగ్రహాలు చూడదగినవి. మొత్తం మీద వాషింగ్ టన్ నగరాన్ని డామినేట్ చేసే యీ భవనాన్ని చూడకుండా రాకూడదు.
ఊరి నిండా ఆఫీసులు, మ్యూజియములు, గ్రంథాలయాలు, 18,19, శతాబ్దపు శైలి కట్టడాలు చాలా ఉన్నాయి. కాని న్యూయార్కులో వలె పెద్ద ఆకాశ హర్మ్యాలు లేవు. న్యూయార్క్ నగరం కన్నా విశాలంగా, సుందరంగా వుంది. ఐనా దేని ప్రత్యేకత దానిదే కదా.
కేపిటల్ హిల్ చూసి బయటకు వచ్చాక మా వాసు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మాచిన్నకోడలు చెల్లెలు, డాక్టర్ లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ ఆనంద్ నన్ను వాళ్ళవూరు హేగర్స్ టౌన్ (Haaggers Town) తీసుకు వెళ్ళారు. మా అబ్బాయిని అతని స్నేహితుడు వాళ్ళవూరు 'ఫెయిర్ఫాక్స్ (Fairfax) తీసుకొని వెళ్ళాడు. (ఇంకా ఉంది).

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి