ఇటీవలి కాలంలో చాలామంది అనకాప ల్లి వెళ్ళినట్లే అమెరికా వెళ్ళి వస్తున్నారు. కొందరు వారి యాత్రావిశేషాలు పత్రికల్లో రాస్తున్నారుకూడా. కొత్తగా నేను రాసేదేముంది అని అడగవచ్చును.కాని,ఎవరి అనుభవం వాళ్ళదే కదా?కొంతమందైనా అమెరికా గురించి తెలియనివాళ్ళూ ,తెలుసుకోదలచినవాళ్ళూ ఉండవచ్చును.వాళ్ళకోసమే ఈ సంగతులు రాస్తున్నాను.
నాకు 80 సం;దాటడంవలన ,అమెరికా వీసా ఇంటర్వ్యూ లేకుండానే సులభంగానే లభించింది.పాస్ పోర్టు అంతకు ముందే వుంది.మా అబ్బాయి టికెట్ పంపించాడు. అసలునేను 2001లోనే అమెరికా వెళ్ళాలనుకున్నాను.కాని, అప్పుడే న్యూయార్కు లోని world trade centre building twin towers ని టెర్రరిస్టులు కూల్చివెయ్యడం వలన యాత్రికులందరికీ కొంత కాలం పాటు అనుమతి లభించలేదు. అందువలన, అప్పుడు అమెరికా బదులు పశ్చిమ యూరప్ దేశాల యాత్రకు వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మా పెద్దబ్బాయి న్యూయార్కులో ఉండటం చేత ఇన్నాళ్ళకి మళ్ళీ బయలుదేరాను.
నేను, 2013 జూన్ నెల 24న బయలుదేరి వైజాగ్ నుంచి హైదరాబాదు మా అమ్మాయి వద్దకువెళ్ళి, అక్కడనుండి జూన్ 27 న ఢిల్లీ వెళ్ళాను. అక్కడ విమానం మారి ఇమిగ్రషన్ పెర్మిట్ తీసుకొని న్యూయార్కు డైరెక్ట్ గావెళ్ళే AirIndia jetplane ఎక్కాను. అది అధునాతనమైనదని చెప్పారు. కాని రాత్రి ఒంటిగంటన్నరకు బయలుదేరవలసినది, నాలుగు గంటలైనా బయలు దేరలేదు. air conditioning system పనిచెయ్యలేదు. ఎంత ప్రయత్నించినా రిపైర్ కాలేదు. అప్పుడు మమ్మల్ని మరొక విమానంలోకి మార్చి తెలవారి 7 గంటలకి international flight permit లభించలేదని, మమ్మల్ని దింపివేసి, న్యూఢిల్లీలోని అశోకా హొటల్ కి పంపించారు.
ఇలా అనుకోకుండా న్యూ ఢిల్లీ కొంత మళ్ళీ చూసేందుకు వీలైంది. అశోకాహొటల్ రూంస్ కూడా బాగున్నాయి. రాత్రంతా నిద్రలేకపోవడం చేత వెంటనే నిద్ర పట్టేసింది. 11గం| కి ఫోన్! 12గం॥ కి భోజనం చేసి సిద్ధంగా ఉండమని. లంచ్ తర్వాత మమ్మల్ని మళ్ళీ బస్సులో విమానాశ్రయం కి తీసుకువెళ్ళారు. అక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తయాక మధ్యాహ్నం 3గంటలకి బోయంగ్ విమానం ఎక్కించారు. తర్వాత ఏ ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా 15గంటల ప్రయాణం తర్వాత న్యూయార్కు విమానాశ్రయంలో సురక్షితంగా దిగాము. AIR INDIA వారి నిర్వాహకానికి ఇదొక మచ్చుతునక అనుకోవచ్చును. రూల్స్ ప్రకారం అంతా అయాక, 1 గంట తర్వాత బయటపడ్డాను.మా అబ్బాయి నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళేప్పటికి అమెరికా కాలమానప్రకారం రాత్రి 11 గంటలైంది.మా flight కి కలిగిన అంతరాయాలగురించి అప్పటికే వాళ్ళు తెలుసుకొని చాలా కంగారు పడ్డారు.
ఈస్ట్ రివర్ పై వంతెన దాటి మాన్ హాటన్‌లో (Manhattan) రివర్సైడ్ వ్యూ లో హడ్సన్ (Hudson) నది ఒడ్డున వున్న ఒక పెద్ద బిల్డింగులో మావాళ్ళు 25వ అంతస్తు లో వాళ్ళ అపార్ట్ మెంట్లో ఉన్నారు. రాత్రి కావడం వల్ల దారిపొడూగునా విద్యుద్దీపకాంతులతో ఆకాశ హర్మ్యాలు వెలుగులు విరజిమ్ముతూ కనిపించాయి. మా అబ్బాయి, కోడలు, మనమడూ ఉన్నారు. మా పెద్దబ్బాయి విజయలక్ష్మణ్ ఒక యూనివర్సిటీ లో ప్రొఫెసర్. కోడలు విజయలక్ష్మి స్థానిక State Bank of India లో మేనేజర్. మనమడు 10 వ తరగతి చదువుతున్నాడు.

2 కామెంట్లు:
మరిన్ని విశేషాలకొరకు ఎదురు చూపు...
మీ అమెరికా యాత్రా విశేషాలు మాతో పంచు కొంటున్నందుకు చాలా సంతోషం. ఇదే విధంగా ఇంత విపులంగా మిగతా భాగాలు కూడా రాసి మమ్మల్ని ఆనందింప చేయండి.ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి