హేగర్స్ టౌన్ కి వెళ్ళేముందు, దారిలో Dr.లక్ష్మి ఆనంద్ ల కూతురు స్నిగ్ధ చదువుకుంటున్న మేరీలాండ్ (Maryland) విశ్వవిద్యాలయం కు వెళ్ళి అమ్మాయి హాస్టల్ రూం లో కొంతసేపు గడిపాము. మేరీలాంద్ యూనివర్సిటీ చాలా పెద్దదే. అన్ని ఇటుకలతొ కట్టబడిన పెద్దా కట్టడాలే. చాలా ఫేకల్టీలు ఉన్నాయి. మధ్య మధ్యలో పార్కులు, చెట్లు, అవెన్యూలతో అందంగా ఉంది. స్నిగ్ధ అండర్ గ్రాడ్యుఏషన్ చేస్తున్నది. neuro biology, Hospital administration చేస్తున్నది. గ్రాడ్యుయేషన్, post-Graduation తర్వాత చెస్తుందట. ఇక్కడ పిల్లలు 18 సం; నిండక ముందే స్వతంత్రంగా బతకాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంచేత పార్ట్ టైం ఏదో ఒక పని చేస్తుంటారు. ధనవంతులైనా నామోషీ పడరు. ఇదిగాక కొంతకాలం పియానో నేర్చుకుంది. ఇప్పుడు నృత్యం నేర్చుకుంటున్నది. తన సహచరులతో కలిసి చేసిన fusion నృత్యం విడియో చూపించింది. చాలా ప్రతిభ, పట్టుదల ఉన్న అమ్మాయి.
మొత్తం మీద నాకంపించింది; ఇక్కడి యువజనం స్వతంత్ర భావాలు కలిగి ఉంటారని, కొత్తవి నేర్చుకోవాలనే తపన కలిగి ఉంటారని. కొందరు మాత్రం స్కూలు వదిలేక చదువు మానివేసి ఏదో పనులు చేసుకుంటూ బదుకుతారు. కొందరు డ్రగ్స్ అలవాటు చేసుకుంటారు.
తర్వాత హేగర్స్ టౌన్ చేరుకున్నాము. ఊరికి శివార్లలో 2 ఎకరాల స్తలం లో వాళ్ళైల్లు వుంది. బాగా పెద్దదే. సెల్లరు (cellar), గ్రౌండ్ ఫ్లోరు, పై అంతస్తు ఉన్నాయి. భార్యాభర్తలకి చెరొక కారు ఉన్నాయి. కింది అంతస్తులో డ్రాయింగ్ రూం, భోజనశాల, వంటగది ఉన్నాయి. పై అంతస్తులో పడక గదులు ఉన్నాయి. సెల్లారులో హోం టీ.వీ.ఉంది. మొత్తం 12 గదులు ఉన్నాయి. ఆరాత్రి అక్కద గడిపాక మర్నాడు Dr,ఆనంద్ తాను 4 గురు సహచరులతో కలిసి ప్రాక్టీసు నడుపుతున్న హాస్పిటల్కి తీసుకు వెళ్ళాడు. వాళ్ళందరూ పిల్లల స్పెషలిస్టులే. ఎవరి ప్రాక్టీసు వాళ్ళకుంది. వీరుకాక ఇద్దరు నర్స్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. ఆ చుట్టుపకల వీళ్ళదే ముఖ్యమైన పిల్లల హాస్పటల్ అని తెలిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి