7, జులై 2011, గురువారం
visakha
విశాఖ
--------;పసిప్రాయంలో నీ వడిలో పరుండితి
నీలతరంగ హస్తాల నిమిరావు నన్ను
ఎలజవ్వనములోన వలచాను నిన్ను
తరులతా కుంతలముల మురిపించినావు
సుందర విశాఖా ! విలాసరేఖా !
శైలకందరాలలో సానుప్రదేశాలలో
సైకత చుంబి ఫేన రాశులలో ంధ్యా
సంధ్యా మారుత సౌరభాలలో
చంద్రోదయ సువర్ణ రోచులలో
అలలపై జలతారుదారుల్లో
ఉదయారుణజలద పంక్తులలో
ఆడియాడి అలసి నిదురించాను
సుందర విశాఖా!విలాసరేఖా!
సుదూరాన నౌకోపరి తలముపై
నీహార దుకూలావృత మైన
నీ తీర సౌభాగ్యమును
నే తిలకించినాను ,పరవశించాను
సుందర విశాఖా! విలాసరేఖా !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి