నిలిచె హిమాంబువుల్ కుసుమ నేత్రములందు సరోజమాలికా
కలితజలాశయంబులును కళ్ళములందున ధాన్యరాశులున్
దళితవిశీర్ణపత్రముల దాకుచు వీచెడి శీతవాతమున్
చలిచలి యంచు నిల్వెడల నోపని మానవాళియున్
----------------
ప్రాభాతోజ్జ్వల రేఖలున్ సమయగా ప్రాలేయ చేలావృతిన్
లోభావించి హిమాంశుడయ్యె నినుడున్ రొచిష్మతిన్ గోల్పడన్
శోభావంతపు స్వర్ణకాంతి వరలెన్ సుక్షేత్రముల్ నల్గడన్
సౌభాగ్యాతిశయమ్ము దక్కికృశతన్ సాగెన్ నదీ,కుల్యలున్
----------------
అలరుల క్రొమ్ముడిన్ దురిమి యంగణమందున రంగవల్లులన్
లలితముగా నలంకరణలన్ బచరించు విలాసినీమణుల్
కలుషవిదూరవాహినులు ,కల్యలు శుభ్రవిరాజచంద్రికల్
ఫలభర నమ్ర భూజములు ,పంచెడినింపుగ తేనెవాకలన్. ( నా హేమంతము కవిత నుండి )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి