3, జులై 2011, ఆదివారం

ghantasala early days

ఘంటసాల గురించి  కొత్తగా చెప్పేదేముందని అనుకోవచ్చును .నిజమేకాని రెండు మాటలు చెప్తాను.తొలిసారిగా ఆయన 'స్వర్గసీమ"లో ఒక కోరస్లో పాడినట్లు అందరు రాస్తారు (౧౯౪౫)తర్వాత గ్రిహప్రవేసం సినిమాలో (ప్రఖ్యాత దర్శకుడు యల్. వి .ప్రసాద్ హీరో )హాలాహలమేగయునో అనే పాట పాడారు.ఆయన యిచ్చిన ప్రైవేటు రికార్డులు "కరుణశ్రీ పద్యాలు,బహుదూరపు బాటసారి ,"వంటి తోలిరోజులవి తెలిసినవే .కాని "గాలిలో నా బతుకు "ప్రైవేటు రికార్డుతెలియక   పోవచ్చును .నాకు జ్ఞాపక   మున్నంత వరకు ఆయన తొలిసినిమా పాటలు౧.కీలుగుర్రంలో "కాదుసుమా కలకాదు ",లైలా మజునూ "లో పయనమయే,ప్రియతమా " సాహుకారు  లో "పలుకరాదటేచిలుకా  ".తర్వాత ఘంటసాలవారు  సినీ సంగీత ఆకాసంలో ఎలా దూసుకు పోయారో తెలిసిన విషయమే. ౧౯౫౦కి ముందు ఎక్కువగా యం.యస్.రామారావు ప్లే బాక్ పాడుతుందే వారు. 

2 కామెంట్‌లు:

Vinay Datta చెప్పారు...

మంచి సమాచారం.

మాధురి.

Rajendra Devarapalli చెప్పారు...

మీరు చెప్పినవాటిల్లో నిజానిజాలు సంగతేమో గానీండి ముద్రారాక్షసాలు సవరించాలి మీరు
కోరస్లో ---కోరస్ లో
గ్రిహప్రవేసం--గృహప్రవేశం
తోలిరోజులవి -తొలిరోజులవి
లైలా మజునూ--లైలా మజ్ను
సాహుకారు--- షావుకారు
ఆకాసంలో-ఆకాశంలో ఇలాంటివి