చాలు
----- సందెవేళలలోన చల్లనిచిరుగాలి చాలు -శీతలీకృత హర్మ్యశ్రేణులేల
స్వఛ్ఛమగు జలధార యొక్కటి చాలు-మత్త మణిమయ మధు పాత్రమేల
తాపముదీర్చ చిక్కటి తరుఛాయయే చాలు -సౌమ్య తూలికా తల్ప శయనమేల
ఆకలి తీరంగ తీయని ఫలములున్నను చాలు -పంచభక్ష్యములతో పరమాన్నమేల
మదిసేదదీర్చు మంచిమాటలు చాలు -కపటవాగ్ధాటి ప్రవాహమేల
నెత్తావి విరజిమ్ము విరజాజి మాలలు చాలు - చిత్రరత్న విభూషజాలమేల
శారదశర్వరీ చంద్రకాంతియె చాలు -కోటివిద్యుత్ప్రభా పుంజమేల
అలలపై కదలాడు మురళీరవము చాలు - శతవాద్య సంకుల మహా ఘోష యేల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి