anemia =అనేమియా లేక రక్తహీనత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.పత్రికల్లో ఆరోగ్య శీర్షికలలో రాస్తుంటారు .
అయినా ఎందుకు రాస్తున్నానంటే --మా అమ్మాయి దగ్గరకు వచ్చే కేసుల్లో కొంతమంది స్త్రీలకూ unTunnaadi. అందుకు
కారణం కేవలం పేదరికం కాదు.ఇతర కారణాలు ఉండవచ్చును.
మనదేశంలో రక్తహీనత పిల్లలలో డెబ్బై శాతం ,గర్భిణీ స్త్రీలలో అరవై శాతం ఉన్నది.దీనివల్ల ప్రసవ సమయంలో తల్లికి ,శిశువుకి ప్రమాదం కలగవచ్చును.
ఆరోగ్యవంతులైన స్త్రీలకు హీమోగ్లోబిన్ రక్తంలో ౧౨-౧౪ గ్రాములు \౧౦౦ఎమ్ .ఎల్ ఉండాలి.రక్తంలో ఎర్రకనాలు కనీసం నలబై లక్షలు (క్యూ. మీ మీ.కి )ఉండాలి.కొందరు ఇంతకన్నా బాగా తక్కువ కలిగి ఉంటారు.
కారణాలు.--౧.పోషకఆహారలోపం ,ముఖ్యంగా ఇనుము ధాతువులోపం వల్ల.౨.బహిష్టు సమయంలో ఎక్కువ రక్త స్రావం వలన. లక్షణాలు =అలసట, నీరసము,పాలిపోవుట ,కళ్ళు తిరుగుట.
జాగ్రతలు, చికిత్స ==పోషకాహారం తీసుకొనుట (ఆకుకూరలు ,గ్రుడ్లు, చిక్కుళ్ళు ,చేపలు మో- )
నెల నెల ,రక్తపరీక్ష, థైరాయిడ్ పరీక్ష
ఐరన్ ,ఫోలిక్ యాసిడ్ ,బీ ౧౨ మాత్రలు.
కొన్ని కేసుల్లో సరిఐన గ్రూపు రక్తం ఎక్కించుట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి