15, జులై 2011, శుక్రవారం

గుండె తడి ... పంతుల జోగారావు కథలు



గుండెతడి.
    పంతులజొగారావు ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ కథారచయిత.  మంచి కథారచయిత.ఎక్కువగా కింది మధ్య తరగతి వారి జీవితాలు,వారి సమస్యలు ,కష్టాలు,సరదాల గురించి రాస్తారు.ఇంతకు ముందు అపురూపం అనే పేరుతో కథల సంపుటి ప్రచురించారు.అందులో 12 కథలు ఇందులో చోటు చేసుకొన్నాయి.అందు వల్ల మిగిలిన 12 కథల గురించి క్లుప్తంగా రాస్తాను.
  ఆయన కథా రచన,శైలి ,భాష,ఆడంబరం లేకుండా simple గా సరళంగా ఉంటుంది.విజయ నగరం జిల్లా మాండలీకం లో సహజం గా సాగిపోతుంది. దీర్ఘ సంభాషణలు, వర్ణనలు ఉండవు. కొన్ని కథల్లో చిన్న twist (మలుపు)  ఉంటుంది. సామాన్యుల కష్టాలు,ఆర్థిక ఇబ్బందులు,తరాల అంతరాలు బాగా వర్ణిస్తారు.ఇతని కథల్లో విషాదం,నిర్వేదం ,ఆర్ధ్రత గూడు కట్టుకొని ఉంటాయి. 30.40,యేళ్ళ క్రితం సామాజిక జీవనం,ప్రధానంగా ఉత్తరాంధ్ర లో lowermiddleclass( కిందిమధ్య తరగతి) ,పేదవారి జీవన సరళిని ప్రతిఫలిస్తుంటాయి. అందుకే ఈయనను ఉత్తరాంధ్ర కొ.కు.(కొడవటిగంటికుటుంబరావు) అంటారు.
      1.అల్లుడోడు-   ఒరిస్సా నుండి రైల్లో దొంగ సారా రవాణా గురించిన కథ.
      2,ఉదయం నుంచీ వాన - సంపన్నుల ఇంట్ళో బేబీ పుట్టిన రోజు పండగకి ,అదే రోజు ఆ ఇంటి పనిమనిషి కూతురు పుట్టినరోజుకి తేడాను చిత్రించిన ,మనసుకి హత్తుకు పోయే కథ..
      3,శరణు ,శరణు -  తండ్రి అపు రూపంగా దాచుకొన్న పుస్తకాలని వృధా అని తమతో తీసుకు పోడానికి వద్దన్నా,ఉపాయంగా మనమరాలు వాటిని తాతగారికి అప్పజెప్పడం కథాంశం.
      4.ఊరికి నిప్పంటుకొంది - చలివేంద్రంలో తగాదాతో ఒక పల్లెలో ముఠా కక్షలు పెరగడం  ఇతివృత్తం.
      5.ఎర్రజీరల కళ్ళు -  మనిషి  బాహ్య స్వరూపం,మాటల కరుకుదనంవల్ల ,తప్పు అంచనా వెయ్యకూడదని గుణపాఠం నేర్పుతుంది,
      6.అభ్యంతరం లేదు  -  పెళ్ళికూతురు శారీరక లోపం ఉన్న వరుడిని  పెళ్ళి చేసుకుందుకు అంగీకరిస్తుంది.తన చెల్లెలకి కూడా అంగవైకల్యం ఉన్న సంగతి తల్లి దండ్రులకు గుర్తు చేస్తుంది.

కామెంట్‌లు లేవు: