ఏంజైనా పెచ్టొరిస్ ;=అనగా చాతీలొ నొప్పి అని అర్థం.గుండెకి తగినంత రక్త ప్రవాహం అందనప్పుడు కలిగే నొప్పి.శరీరానికంతకు రక్తాన్ని సరఫరా చేసే గుండె సరిగా పనిచేయాలంటే దానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేసేవి కొరోనరీ ధమనులు.ఈ ధమనులు ,వాటి శాఖలు ఇరుకైనా ,అడ్డు ఏర్పడినా ,తాత్కాలికంగా ప్రాణ వాయువు అందక కలిగే నొప్పి ఏంజైనా .ఇది అథెరొ- స్క్లెరొసిస్ అనే మార్పు వలన కలుగును.
ఇది రెండు రకములు ;=1.నిలకడ ఏంజైనా - ప్రయాస,మానసికమైన ఒత్తిడి, పరిగెత్తుటవంటి వాటి వలన వస్తుంది.ముందు ఊహించవచ్చును.విశ్రాంతితో త్వరగా తగ్గుతుంది. 2.నిలకడలేని ( unstable angina) అనుకొకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు వస్తుంది. ఎక్కువసేపు ఉంటుంది.
కారణాలు;= 1.పొగతాగుట 2.అధిక రక్త పోటు 3.మధుమేహం 4.ఊబకాయం 5.అధిక మద్యపానం 6.వ్యాయామం లేక పోవడం 7.వంశ పారంపర్యం 8.మానసిక ఒత్తిడి 9.వృద్ధాప్యంలో కలిగే మార్పులు .
లక్షణలు ;=1చాతీనొప్పి 2.చెమటలుపట్టుట 3.కడుపులోబాధ4.కళ్ళు తిరుగుట 5.ఊపిరిబిగియుట 6.వాంతి అగునట్లు వికారము
ఏంజైనా ,గుందెపోటు (heart attack) ఒకటేనా? --కాదు.గుందె పోటులో దానికండరంలో కొంత భాగం శాశ్వతంగా చచ్చిపోతుంది. ఏంజైనాలో తాత్కాలిక బాధ ,ఇబ్బంది కలుగును.కాని,అశ్రద్ధ చేస్తే గుండెపోటుకి దారితీస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి