వృద్ధాశ్రమం : శ్రీకాకుళం వృద్ధాశ్రమానికి ముఖ్య అతిధిగావెళ్లాను.సంస్థ 1996 నుండి పని చేస్తున్నాది. బి.కృష్ణ మూర్తి గారనే రిటైర్డు ఇంకం టాక్స్ కమిషనర్ కృషి ,దీక్ష వలన స్థాపించబడినది.కొందరు దాతల విరాళాలతో ,కొంత ప్రభుత్వ సాయంతో నడుస్తున్నది. 70mandi ఇందులో ఉచితంగావసతి ,భోజన సౌకర్యం పొందుతున్నారు.నెలకు లక్ష రూఖర్చు ; ఆవుతున్నది.నాకు వీలయిన ఉడతా సాయం చేస్తున్నాను.
వయోదికుల ఆశ్రమాల ఆవశ్యకత.;-౧.సగటు ఆయుప్రమానం పెరిగి వృద్ధుల సంక్య పెరుగుతున్నది.౨.వారిలో పేదవారు ఎక్కువ.౩.ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమై వృద్ధులు ఒంటరిగా జీవించ వలసి వస్తున్నది.౪.వారికి ఆలనా ,పాలనా చూసేవారు ఉండరు
పెద్దనగరాలలో డబ్బు తీసికొని అన్ని సౌకర్యాలతో ఆశ్రయ మిచ్చే రిటైర్మెంట్ హోమ్స్ ఉన్నాయికాని అవి పేదవారికి ఉపయోగ పడవు.ఇటువంటి .ఉచిత ఆశ్రమాలు కొన్ని మాత్రమె కొన్ని చోట్లలో మాత్రమె ఉన్నాయి..
ప్రజలు.,ప్రభుత్వమూ,ఇంకా ఎక్కువ ఆస్రమాలని స్థాపించవలసిన అవసరం ఎంతయినా ఉన్నది.పెదవారయిన వృద్ధులకు ఇప్పుడిస్తున్న 200roo .పెన్షన్ రూ.౫౦౦కయినా పెంచాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి